Advertisement
Google Ads BL

పవన్ - హరీష్ ఓ ఇంట్రెస్టింగ్ టైటిల్


పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ థియేటర్స్ లోకి దిగడానికి టైం దగ్గరపడింది. పవన్ ఫాన్స్ వకీల్ సాబ్ రిలీజ్ కోసం క్షణం ఒక యుగంలా గడుపుతున్నారు. ఇక వకీల్ సాబ్ తర్వాత పవన్ కళ్యాణ్ ఏకే రీమేక్, క్రిష్ తో హరి హర వీరమల్లు మూవీస్ ని చేస్తున్నారు. ఆ తర్వాత హరీష్ శంకర్ తో మరో మూవీకి కమిట్ అయిన విషయం తెలిసిందే. హరీష్ శంకర్ - పవన్ కాంబో గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ అవడంతో ఇప్పుడు మరోసారి రిపీట్ కాబోతున్న ఈ కాంబోపై విపరీతమైన అంచనాలున్నాయి. హరీష్ మళ్ళీ పవర్ స్టార్ ని ఎంత పవర్ ఫుల్ గా చూపించబోతున్నాడో అనే క్యూరియాసిటిలో పవన్ ఫాన్స్ ఉన్నారు.

Advertisement
CJ Advs

పవన్ - హరీష్ ప్రీ లుక్ పోస్టర్ లో ఇదేదో పొలిటికల్, దేశభక్తి నేపథ్యం ఉన్న మూవీగా ఉండబోతుంది అనే హింట్ ఇచ్చిన హరీష్ శంకర్ ఈ సినిమా విషయాలు ఎక్కడా నోరు జారడం లేదు. వకీల్ సాబ్ ఈవెంట్ లో కూడా హరీష్ పవన్ ని పొగిడాడే తప్ప తమ సినిమా నేపధ్యాన్ని కానీ, సినిమా ముచ్చట్లు గాని ప్రస్తావించలేదు. వకీల్ సాబ్ అంటే వాదించడమే కాదు.. వాయించడమూ తెలుసు అంటూ పవర్ ఫుల్ డైలాగ్స్ చెప్పిన హరీష్.. పవన్ ని ఖచ్చితంగా పవర్ ఫుల్ గానే చూపిస్తాడని ఫ్యాన్స్ ఫిక్స్ అవుతున్నారు. 

అయితే పవన్ కళ్యాణ్ తో హరీష్ చెయ్యబోయే సినిమాలో పవన్ లెక్చరర్ గాను అలాగే తర్వాత పొలిటికల్ లీడర్ గాను కనిపిస్తాడని.. అయితే ఈ సినిమాకి టైటిల్ గా సంచారి అనే టైటిల్ అయితే బావుంటుంది అని హరీష్ అనుకుంటున్నాడట. పవన్ కి చెప్పి పవన్ నుండి గ్రీన్ సిగ్నల్ వస్తే గనక సంచారి టైటిల్ ని అధికారికంగా ఎనౌన్స్ చేస్తారని అంటున్నారు. ఈ మూవీని మైత్రి మూవీస్ వారు నిర్మిస్తున్నారు.

Pawan - Harish is an interesting title:

Pawan kalyan - Harish Shankar film coming with an interesting title
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs