Advertisement
Google Ads BL

అఖిల్ ఏజెంట్ లుక్: ఎక్స్ పెక్ట్ చెయ్యలేదు


అఖిల్ సినిమా తో వెండితెరకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్.. ఆ సినిమా లో మాస్ గా ప్రోజెక్ట్ అవుదామనుకున్నాడు. కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. తర్వాత హలో, మిస్టర్ మజ్ను లో అఖిల్ కొత్త లుక్ ట్రై చెయ్యకపోయినా.. లవర్ బాయ్ లా ఆకట్టుకున్నాడు. ఆ సినిమాలు కూడా అఖిల్ ని నిరాశపరిచాయి. ఆఖరికి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో టాప్ హీరోయిన్ పూజ హెగ్డే తో రొమాంటిక్ గా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లోనూ అఖిల్ మేకోవర్ కొత్తగా ఏం కనిపించలేదు. కానీ అఖిల్ సురేందర్ రెడ్డి తో చెయ్యబోయే ఏజెంట్ సినిమా లో మాత్రం కొత్తగా మాసివ్ అవతార్ లో ఫుల్ గా మేకోవర్ అయ్యాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో #AKHIL5 గా తెరకెక్కుతున్న అఖిల్ కొత్త సినిమా ఫస్ట్ లుక్ ని అఖిల్ బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేసారు.

Advertisement
CJ Advs

ఏజెంట్ గా స్పై పాత్రలో కనిపించనున్న అఖిల్ మేకోవర్ చూస్తే.. ఎవరూ ఊహించని లుక్ లో కనిపించాడు. అఖిల్ అలా కనిపించబోతున్నాడని అసలు ఎక్స్ పెక్ట్ కూడా చేసి ఉండరు. అంతగా మాస్ లుక్ లో హెయిర్ పెంచి కొత్త మేకోవర్ లో అదరగొట్టేస్తున్నాడు. చేతిలో సిగార్, కండలు తిరిగిన దేహం తో అఖిల్ లుక్ అదిరింది. సురేందర్ రెడ్డి ఏజెంట్ కథ కి అఖిల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని అఖిల్ కి కథ చెప్పి ఒప్పించి.. ఈ సినిమాని పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో సురేందర్ రెడ్డి తెరకెక్కించబోతున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమా టైటిల్ అండ్ లుక్ తోనే అంచనాలు పెరిగేలా చేసారు. అఖిల్ ఇప్పటివరకు చేసినవి ఒక ఎత్తు.. ఈ ఏజెంట్ లుక్ మరొక ఎత్తు అనేలా ఉంది. అఖిల్ బర్త్ డే కి అదిరిపోయే ట్రీట్ లా ఉంది ఏజెంట్ లుక్. మరి ఈ రోజు బర్త్ డే జరుపుకుంటున్న అఖిల్ కి సినీ జోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.

Agent First Look: Akhil Stylish Makeover:

Akhil Agent First Look Out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs