Advertisement
Google Ads BL

మహేష్ సబ్జెక్ట్ తో ఏజెంట్ గా అఖిల్


అఖిల్ బర్త్ డే స్పెషల్ గా అఖిల్ తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ నుండి కొత్త పోస్టర్స్ రిలీజ్ చేసింది టీం. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ పోస్టర్ రివీల్ కాగా.. రేపు అఖిల్ బర్త్ డే రోజున.. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో కొత్త సినిమా లుక్ రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 8 ఉదయం 9 గంటలకి అఖిల్ - సురేందర్ రెడ్డి మూవీ ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ సినిమా కి ఏజెంట్ అనే టైటిల్ ని ఫిక్స్ చేసారు.

Advertisement
CJ Advs

అయితే ఈ ఏజెంట్ స్క్రిప్ట్ ని సురేందర్ రెడ్డి మహేష్ బాబు కోసం రాసి పెట్టుకున్నాడు. మహేష్ తో ఈ ఏజెంట్ సబ్జెక్ట్ తో సినిమా చెయ్యాలని సురేందర్ రెడ్డి కి ఉన్నప్పటికీ.. మహేష్ కి ఉన్న వేరే కమిట్మెంట్స్ కారణంగా నో చెప్పడంతో.. ఇప్పుడు అదే సబ్జెక్ట్  తో సురేందర్ రెడ్డి అఖిల్ తో సినిమా మొదలు పెట్టబోతున్నాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ లా ఈ సినిమాని  సురేందర్ రెడ్డి తెరకెక్కించబోతున్నాడు. అఖిల్ ని స్పై గా చూపించబోతున్న సురేందర్ రెడ్డికి ఎంత బడ్జెట్ కావాలంటే అంత పెట్టే ఏకే ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు దొరకడం ఈ సినిమాకి ప్లస్ పాయింట్. మరి రేపు అఖిల్ బర్త్ డే రోజున అఖిల్ కొత్త సినిమా పూజ తో పాటుగా టైటిల్ అండ్ లుక్ కూడా రివీల్ కాబోతుంది అనే న్యూస్ చూసిన అక్కినేని ఫాన్స్ ఆనందంలో పండగ చేసుకుంటున్నారు.

Akhil and Surender Reddy film First look on 8th April:

Akhil Turns Agent For Surender Reddy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs