Advertisement
Google Ads BL

సుకుమార్ ని ఆడుకుంటున్న రష్మిక ఫాన్స్


సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం పుష్ప నుండి అల్లు అర్జున్ ఫాన్స్ కి ట్రీట్ రాబోతుంది. పుష్పరాజ్ ని పరిచయం చెయ్యబోతున్నారు. అది కూడా ఈ రోజు సాయంత్రం 4 గంటలకి. అయితే అల్లు అర్జున్ ఫాన్స్ కి ట్రీట్ అదిరింది అందులో సందేహమే లేదు. కానీ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న రష్మిక ఫాన్స్ మాత్రం దర్శకుడు సుకుమార్ ని ఆడుకుంటున్నారు. ఎందుకంటే రష్మిక పుట్టిన రోజు జరిగి రెండు రోజులైంది. రష్మిక బర్త్ డే రోజున రష్మిక పుష్ప లుక్ రివీల్ చేస్తారని చాలా ఆశ పడ్డారు. కానీ రష్మిక పుష్ప లుక్ కాకుండా జస్ట్ రష్మీక కి స్పెషల్ బర్త్ డే విషెస్ అంటూ నార్మల్ ఫోటో పెట్టి విషెస్ చెప్పేసారు. దానితో రష్మిక ఫాన్స్ బాగా డిస్పాయింట్ అయ్యారు.

Advertisement
CJ Advs

పాన్ ఇండియా ఫిలిం నుండి రష్మిక పుట్టిన రోజు ట్రీట్ వస్తుంది అనుకుంటే సుకుమార్ ఉసూరుమనిపించాడు అంటూ ఫీలవుతున్నారు. మరో పక్క రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న శర్వానంద్ ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా ఇంకా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఉంది. సినిమా షూటింగ్ మొదలు పెట్టలేదు. కానీ ఆ సినిమా నుండి రష్మిక ట్రెడిషనల్ గా ఉన్న అదిరిపోయే లుక్ రివీల్ చేసారు. అందులో రష్మిక చీర కట్టులో అద్భుతంగా ఉంది. షూటింగ్ మొదలవ్వని సినిమా నుండే రశ్మికకి బర్త్ డే విషెస్ అంటూ ఫస్ట్ లుక్ వదిలితే ఎప్పటినుండో పుష్ప షూటింగ్ లో పాల్గొంటున్న రష్మిక లుక్ ఇవ్వడానికి ఏమైంది.. సుకుమార్ కి మరీ ఇంత నిర్లక్ష్యం పనికిరాదు. 

అంటే రష్మిక లుక్ ని అంత సీక్రెట్ గా దాయలా.. ఏ పుష్ప రాజ్ ఫస్ట్ లుక్ దగ్గరనుండి ఈ రోజు విడుదల కాబోయే పుష్పరాజ్ వీడియో వరకు ప్లానింగ్ తో చేస్తున్నారు. కానీ రష్మిక లుక్ వదల్లేదు అంటూ రష్మిక ఫాన్స్ గట్టిగానే ఫీలవుతున్నారు.

Rashmika fans expecting her first-look from Pushpa Movie:

Rashmika fans expecting her first-look from Pushpa on her Birthday
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs