పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ - అనన్య పాండే హీరో హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా షూటింగ్ ముంబై పరిసరప్రాంతాల్లో జరుగుతుంది. కరణ్ జోహార్ వన్ అఫ్ ద నిర్మాతగా తెరకెక్కుతున్న లైగర్ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో భారీ క్రేజ్ ఉంది. మరో నిర్మాత ఛార్మి కూడా లైగర్ షూటింగ్ స్పాట్ లో ఉంటూ షూటింగ్ ని సక్సెస్ ఫుల్ గా నడిపిస్తుంది. అప్పుడప్పుడు విజయ్ దేవరకొండ, పూరి, ఛార్మీలు బాలీవుడ్ లో కరణ్ జోహార్ ఇంట్లో జరిగే పార్టీలకు హాజరవుతున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ బైక్ పై స్టైలిష్ గా కూర్చోగా.. ఛార్మి - పూరి లు విజయ్ కి అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు నించున్న పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
విజయ్ దేవరకొండ స్టైలిష్ పిక్ తో పాటుగా లైగర్ మూవీ అప్ డేట్ ఇచ్చింది టీం. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ జాకీ చాన్ అలాగే మరికొంతమంది హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ ని ఎంపిక చేసుకుని వారి ఆధ్వర్యంలో లైగర్ యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరించబోతున్నట్లుగా టీం అప్ డేట్ ఇచ్చింది. అప్పుడప్పుడు సెట్స్ నుండి లైగర్ టీం వదులుతున్న ఫొటోస్ ఒక ఎత్తు. తాజాగా విజయ్ దేవరకొండ బైక్ పై స్టైల్ గా కూర్చున్న పిక్ ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది ఆ పిక్. విజయ్ దేవరకొండ చాలా స్టయిలిన్గ్ గా స్పోర్ట్స్ బైక్ మీద నించొగా.. పూరి అండ్ ఛార్మీలు అంతే స్టైలిష్ గా ఫోటో కి ఫోజులిచ్చారు.