Advertisement
Google Ads BL

సాయి పల్లవితో వరుణ్ పెళ్లి: బాబు రియాక్షన్


ఈమధ్యన జబర్దస్త్, అదిరింది ప్రోగ్రామ్స్ లేక ఖాళీగా ఉంటున్న నాగబాబు విలన్ అవతారం ఎత్తబోతున్నట్లుగా కొన్ని ఫొటోస్ తో హింట్స్ ఇస్తున్నాడు. ఓ మాస్ విలన్ అవతార్ ఫోటో ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో టాలీవుడ్ కి కొత్త విలన్ గా నాగబాబు ఎంట్రీ ఇవ్వబోతున్నాడని అనుకున్నారు. అయితే నాగబాబు ఓ హిందీ మూవీ కోసం ఇలాంటి గెటాప్ వేసాడని.. ఛత్రపతి సినిమా బాలీవుడ్ రీమేక్ లో బెల్లంకొండ కి విలన్ గా నాగబాబు కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం బుల్లితెర షోస్ కి, సినిమాలకు దూరంగా ఉంటున్న నాగబాబు అప్పుడప్పుడు అభిమానులతో సోషల్ మీడియాలో లైవ్ చాట్ లో పాల్గొంటున్నాడు.

Advertisement
CJ Advs

తాజాగా నాగబాబు అభిమానులతో లైవ్ చాట్ లో ఉన్నప్పుడు అభిమానులు రకరకాల ప్రశ్నలతో పాటుగా ఈ మధ్యనే నిహారిక పెళ్లి చేసిన నాగబాబు ని వరుణ్ పెళ్లి విషయాన్ని అడుగుతున్నారు. అంతేకాదు ఓ అభిమాని మరి కాస్త ముందడుగు వేసి ఫిదా సినిమాలో వరుణ్ సరసన నటించిన సాయి పల్లవితో వరుణ్ తేజ్ పెళ్లి జరిగితే బావుంటుంది అనగా దానికి నాగబాబు రియాక్షన్ మాములుగా లేదు. అభిమాని అలా చెప్పడంతో నాగబాబు నిర్ఘాంత పోయాడు. తర్వాత నాగబాబు జాతి రత్నాలు సినిమాలో బ్రహ్మానందం జడ్జి స్థానంలో కూర్చున్న ఫోటోను ఎమోజీగా పెట్టి మీకు మీరే తీర్పు చెప్పుకోండి నేను జడ్జి ప్లేస్ నుంచి వెళ్లిపోతానంటూ ఎక్స్‌ప్రెషన్ వచ్చే ఫోటో పెట్టాడు. మరి నాగబాబుకి ఏం చెప్పాలో తెలియక పోయినా వరుణ్ తేజ్ పెళ్లి మాత్రం త్వరలోనే చేస్తాడనేది మాత్రం అర్ధమవుతుంది.

Naga Babu Shocking Reaction On Varun Tej Marriage With Sai Pallavi:

Varun Tej is getting married to Sai Pallavi: NagaBabu reaction
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs