Advertisement
Google Ads BL

ఆడపిల్లకి జన్మనిచ్చిన బిగ్ బాస్ కంటెస్టెంట్


ఎన్టీఆర్ హోస్ట్ గా తెలుగులో ఫస్ట్ టైం బుల్లితెర మీద మొదలైన బిగ్ బాస్ షో లో పార్టిసిపేట్ గా వచ్చిన హరితేజ అప్పటికే బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు పరిచయమే. కాకపోతే బిగ్ బాస్ తో హరితేజ మరింతగా ఫెమస్ అయ్యింది. మనసు మమతా సీరియల్ తో బుల్లితెర కి ఎంట్రీ ఇచ్చిన హరితేజ త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ సినిమాతో సూర్యకాంతంగా పాపులర్ అయ్యింది. అంతకుముందే కొన్ని సినిమాల్లో నటించిన హరితేజాకి ఆ సినిమా తర్వాత మరింతగా అవకాశాలొచ్చాయి. 

Advertisement
CJ Advs

ఇక బిగ్ బాస్ క్రేజ్ తో యాంకర్ గాను అదరగొట్టిన హరితేజ 2015 లో వివాహం చేసుకుని పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయ్యింది. ఇక గత ఏడాది ప్రెగ్నెంట్ అయిన హరితేజ సీమంతం వేడుకలు సోషల్ మీడియాలో హల్చల్ చేసాయి. బిగ్ బాస్ ఉత్సవం అంటూ స్టార్ మా లో ప్రారం అయిన ప్రోగ్రాం లోనూ హరితేజాకి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చేతుల మీదుగా సీమంతం జరిగింది. అంతేకాదు.. హరితేజ బేబీ బంప్ ఫోటో షూట్ ఫొటోస్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా హరితేజ పండంటి ఆడపిల్లకి జన్మనిచ్చినట్లుగా ప్రకటించింది. హరితేజాకి ఆడపిల్ల పుట్టినట్లుగా ఈ శుభవార్తని అభిమానులతో షేర్ చేసుకుంది. 

Hari Teja Blessed With Girl:

Hari Teja blessed with a baby girl 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs