బిగ్ బాస్ సీజన్ 4 డిసెంబర్ లో ముగిసింది. ఏ సీజన్ కి లేని క్రేజ్ బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ కి వచ్చింది. మెగాస్టార్ చిరు ఆఫర్స్, నాగార్జున ఆఫర్స్ తో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ క్రేజ్ ఇమేజ్ కూడా పెరిగాయి. అయితే బిగ్ బాస్ సీజన్ 4 లో మూడో స్థానంలో నిలిచిన సోహెల్ కి హీరో ఆఫర్ రావడమే కాదు.. అప్పుడే సినిమా కూడా మొదలు పెట్టేసాడు. సోహెల్ కి హీరోయిన్ కూడా వచ్చేసింది. అలాగే సెకండ్ ప్లేస్ లో ఉన్న అఖిల్ కూడా మోనాల్ తో కలిసి ఆంధ్ర అబ్బాయి - గుజరాతి అమ్మాయి అంటూ సినిమా మొదలు పెట్టేసాడు. కానీ బిగ్ బాస్ విన్నర్ గా నిలిచిన అభిజిత్ మాత్రం ఇంకా బిజీ కాలేదు.
సీజన్ 4 ముగిసి నాలుగు నెలలు గడుస్తున్నా అభిజిత్ నుండి ఫాన్స్ కి గుడ్ న్యూస్ అందలేదు. విన్నర్ గా బయటికి రాగానే నాలుగైదు సినిమాల ఆఫర్స్ అభిజిత్ కి వచ్చాయని.. మొన్నటికి మొన్న నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ లో అభిజిత్ కి మూడు బిగ్ ఆఫర్ వచ్చాయని.. నాగ్ తో డీల్ కూడా సెట్ అయ్యింది అనే న్యూస్ నడిచినా.. అభిజిత్ మాత్రం కొత్త సినిమా మొదలు పెట్టిన దాఖలాలే కాదు.. అసలు బయట కూడా కనిపించడం లేదు. అంతేకాదు కనీసం సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా లేడు. దివి అవకాశాలతో బిజీ అయితే హారిక, లాస్య లాంటి వారు యూట్యూబ్ ఛానల్స్, అలాగే స్టార్ మా లో ప్రోగ్రామ్స్ చేసుకుంటున్నారు. ఆఖరికి అవినాష్ అరియనాలు బాగా బిజీగా వుంటున్నారు. కానీ అభిజిత్ ఏమైపోయాడో అంటూ ఫాన్స్ మాత్రం బాగా వర్రీ అవుతున్నారు.