Advertisement
Google Ads BL

ఎందుకంత సీక్రెట్ వకీల్ సాబ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ మరో మూడు రోజుల్లో థియేటర్స్ లోకి దిగబోతుంది. సుడిగాలి సునామీలా మూడు రోజుల్లోనే వకీల్ సాబ్ కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ చేరుకుంటుంది అంటూ నిర్మాత దిల్ రాజు కలలు కంటున్నాడు. ఇలాంటి నిర్మాత దొరకడం అదృష్టం అంటూ పవన్ దిల్ రాజుని ఆకాశానికెత్తేసాడు. ఇక ఈ సినిమాలో నటించిన అంజలి, నివేత థామస్, అనన్య నాగల్ల లు స్పెషల్ ఇంటర్వూస్, వకీల్ సాబ్ ఈవెంట్స్ లో అంజలి, అనన్య నాగల్ల సందడి చేసారు. నివేత థామస్ కి కరోనా పాజిటివ్ రావడంతో ఆమె ప్రస్తుతం హోమ్ క్వారంటైన్ లో ఉంది. అయితే ట్రైలర్ రిలీజ్ దగ్గరనుండి.. ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇంటర్వ్యూ వరకు ఈ సినిమాలో మరో హీరోయిన్ గా నటిస్తున్న శృతి హాసన్ కనిపించడం లేదు.

Advertisement
CJ Advs

వకీల్ సాబ్ ఫ్లాష్ బ్యాక్ లో పవన్ వైఫ్ గా శృతి హాసన్ కనిపించబోతుంది. కంటి పాప సాంగ్ లో శృతి హాసన్ స్టిల్స్, అలాగే శృతి హాసన్ కేరెక్టర్ ని రివీల్ చేసినా.. ట్రైలర్, ఇంటర్వూస్ లో శృతి విషయంలో తెగ సీక్రెట్ మెయింటింగ్ చేస్తుంది టీం. అసలు వకీల్ సాబ్ టీం శృతి హాసన్ ని హైలెట్ చెయ్యకుండా సస్పెన్స్ మెయింటింగ్ చేస్తుందా? లేదా శృతి హాసన్ వకీల్ సాబ్ ని పట్టించుకోవడం లేదా?. ఏది ఏమైనా గబ్బర్ సింగ్ తో హిట్ పెయిర్ అనిపించుకున్న పవన్ - శృతి జోడి, కాటమరాయుడు దెబ్బకి సినిమాలను వదిలేసింది శృతి హాసన్. మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాక రవితేజ క్రాక్ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న శృతి హాసన్ వకీల్ సాబ్ తో ను హిట్ కొడుతుందేమో చూద్దాం.

Vakeel Saab doing secret maintenance in Shruti Haasan:

Vakeel Saab releasing on April 9th 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs