బిగ్ బాస్ తెలుగులో ఎంతగా పాపులర్ రియాలిటీ షో గా మారిందో తెలిసిందే. బుల్లితెర ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్న బిగ్ బాస్ 5 కూడా జులై నుండి మొదలు కాబోతుంది. స్టార్ మా ఇప్పటికే బిగ్ బాస్ షో కి సంబందించిన కంటెస్టెంట్స్ ని ఫైనల్ చేసే పనిలో ఉంది. ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీస్ ని స్టార్ మా ఫైనల్ చేసినట్లుగా వార్తలొస్తున్న.. అది ఎవరు అనేది సీజన్ 5 ఓపెనింగ్ డే వరకు బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు బిగ్ బాస్ యాజమాన్యం. కానీ వాళ్ళు ఎంతగా జాగ్రత్తపడినా బిగ్ బాస్ లీకులు కామన్ అనే విషయం వాళ్ళకి తెలుసు. బిగ్ బాస్ సీజన్ 2, 3, 4 కి ఆ లీకులే స్టార్ మా కొంపముంచాయి.
ఇక ఎంపికైన కంటెస్టెంట్స్ బిగ్ బాస్ కి వెలుతున్నట్టుగా ఎక్కడా చెప్పకూడదు. అది బిగ్ బాస్ అగ్రిమెంట్. కానీ ఇప్పుడొక టిక్ టాక్ స్టార్ రూల్స్ అతిక్రమించి బిగ్ బాస్ 5 కి వెళుతున్నటుగా చెప్పేసాడు. అతనే దుర్గారావు. టిక్ టాక్స్ లో నాది నక్కిలిసు గొలుసు సాంగ్ తో బాగా ఫెమస్ అయిన దుర్గారావు కి ఈసారి బిగ్ బాస్ 5 నుండి పిలుపొచ్చింది.. ఆ విషయాన్ని అడిగితే నిజమే.. వాళ్ళు పిలిస్తే ఖచ్చితంగా వెళతానని చెప్పాడు. అయితే ఇప్పటికే బిగ్ బాస్ 5 కి దుర్గారావు పేరు ఫిక్స్ అయ్యింది అని.. ఆ ఊపుతోనే దుర్గారావు ఆ విషయాన్నీ బయట పెట్టాడని అటున్నారు. మరి టిక్ టాక్ స్టార్ గా దుర్గారావు బుల్లితెర నుండి వెండితెర కి వెళ్ళిపోయాడు. కొన్ని సినిమాల్లో దుర్గారావు గెస్ట్ రోల్స్ అంటే రవితేజ, జగపతి బాబు సినిమాల్లో అతన్ని చూసాము.