Advertisement
Google Ads BL

ఈ సినిమా అయినా కెరీర్ ని కాపాడుతుందా


తెలుగులో వెంకీ పక్కన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించినా, గీతాంజలి తో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ చేసినా.. తెలుగమ్మాయి అంజలి కి లక్కు కలిసి రాలేదు. అటు తమిళ్ లోనూ అంజలి ప్రేమ వ్యవహారం నడిపి కెరీర్ ని చేజేతులా చేజార్చుకుంది. ఇక రీసెంట్ గా అంజలి చేసిన నిశ్శబ్దం సినిమా విషయంలోనూ అంజలి పోలీస్ అధికారిగా నటించి నెటిజెన్స్ నుండి ట్రోల్ కి గురయ్యింది. ఆ పాత్రలో అంజలి లుక్స్ బాగా డిస్పాయింట్ చేసాయి. అంజలి బాగా చిక్కిపోయి.. వర్కౌట్స్ అంటూ సన్నబడి లుక్స్ విషయంలో తేలిపోయింది. ప్రస్తుతం అంజలి ఫామ్ లోనే ఉన్నాను అని చెప్పుకున్నా అంజలి మాత్రం అక్కడక్కడా గెస్ట్ పాత్రలకే సర్దుకుపోవాల్సి వచ్చింది.

Advertisement
CJ Advs

ప్రస్తుతం అంజలి ఆశలన్నీ వకీల్ సాబ్ మీదే ఉన్నాయి. ఆ సినిమా హిట్ అవుతుంది. కానీ క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్ కే వెళుతుంది తప్ప హీరోయిన్స్ గా చేసిన అంజలి, నివేత థామస్ కి కానీ హైలెట్ అవ్వరు. వాళ్ళు పర్ఫెక్ట్ గా నటించినా, అద్భుతంగా అభినయించినా పవన్ క్రేజ్ ముందు తేలిపోతామేమో అనే అనుమానం వాళ్ళలోనూ ఉంది. ప్రస్తుతం వకీల్ సాబ్ ప్రమోషన్స్ కోసం అంజలి చాలా కష్టపడుతుంది. సోలో ఇంటర్వూస్, టీం ఇంటర్వూస్ అంటూ అంజలి మీడియాతో ఇంటరాక్ట్ అవుతుంది. నేను ఇంకా క్రేజ్ లోనే ఉన్నాను, ఫామ్ లోనే ఉన్నాను అంటూ ముచ్చట్లు చెబుతుంది. చూద్దాం వకీల్ సాబ్ అంజలి కెరీర్ ని కాపాడుతుందా? లేదా? అనేది.

Anjali Career In Dilemma:

Anjali Interview About Vakeel Saab Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs