పవన్ కళ్యాణ్ తో సినిమా తియ్యాలనే కలను దిల్ రాజు వకీల్ సాబ్ తో సాకారం చేసుకున్నాడు. అందుకోసం ఎక్కడా వెనకాడకుండా ఖర్చు పెట్టాడు దిల్ రాజు. అసలైతే వకీల్ సాబ్.. లో బడ్జెట్ మూవీనే. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో అనేసరికి అది కాస్తా భారీ బడ్జెట్ అయ్యి కూర్చుకుంది. అందులో పవన్ కళ్యాణ్ పారితోషకమే హైయ్యెస్ట్. ఇక పవన్ క్రేజ్ ముందు బడ్జెట్ ఓ లెక్కా.. బడ్జెట్ కి రెండింతల కలెక్షన్స్ వస్తాయని దిల్ రాజు నమ్మకం. అది నిజమే దిల్ రాజు లెక్క తప్పలేదు. వకీల్ సాబ్ కి ఫాన్స్ లోను, ప్రేక్షకుల్లోనూ, ట్రేడ్ లోనూ విపరీతమైన అంచనాలున్నాయి. అందుకే వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీగా అంటే రెండు కోట్లు ఖర్చు పెట్టి గ్రాండ్ గా చేద్దామని ఫిక్స్ అయ్యాడు.
ఏప్రిల్ 3న వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ నడిబొడ్డున కనీ వినీ ఎరుగని రీతిలో అతిరథమహారధుల మధ్యన అంగరంగ వైభవంగా ప్లాన్ చేసుకున్నాడు. రెండు కోట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఖర్చు పెట్టబోతున్నారంటే అమ్మో అనుకున్నారు అంతా. అయితే ఇప్పడు వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఓపెన్ గ్రౌండ్ లో భారీ ఎత్తున చెయ్యడానికి హైదరాబాద్ పోలీస్ లు అనుమతి దొరకలేదు. కరోనా ఆంక్షల కారణంగా వకీల్ సాబ్ ఈవెంట్ కి అనుమతులు దొరకని కారణంగా నేడు జరగాల్సిన వకీల్ సాబ్ ఈవెంట్ క్యాన్సిల్ అవడంతో దిల్ రాజుకి రెండు కోట్లు మిగినట్టే కదా.
అయితే వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ రోజు జరక్కపోయినా.. ఈ ఈవెంట్ ఓ అన్నంత హంగామా లేకుండా హైదరాబాద్ లోని శిల్ప కళావేదికలో రేపు అంటే ఏప్రిల్ 4న జరగబోతుంది.