సెలబ్రిటీస్ పిల్లలంటే.. బయట కనబడగానే ఫోటో గ్రాఫర్స్ తమ కెమెరాలకు పని చెప్పేస్తుంటారు. మహేష్ బాబు కొడుకు కూతురు గౌతమ్, సితార లు ఎంతగా ఫెమస్ అయ్యారో.. ఆ తర్వాత అల్లు అర్జున్ పిల్లలు అల్లు అయాన్, అర్హ లు అంతే ఫెమస్ అయ్యారు. ఎన్టీఆర్ ఎక్కువగా తన కొడుకు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లను మీడియా కి ఫోకస్ కానివ్వడు. కానీ మహేష్, అల్లు అర్జున్ లు మాత్రం తమ పిల్లల్ని వెకేషన్స్ కి, షాప్పింగ్స్ కి అని అలా ఎప్పటికప్పుడు మీడియాకి కనిపిస్తూనే ఉంటారు. నేడు అల్లు అర్జున్ కొడుకు అయాన్ పుట్టిన రోజు కావడంతో.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాడు. అల్లు అర్జున్ ఫాన్స్ అల్లు అయాన్ బర్త్ డే హాష్ టాగ్ తో ట్రేండింగ్ లో ఉంచారు.
ఇక అల్లు అర్జున్ తన కొడుకు అయాన్ చేత కేక్ కట్ చేయించిన ఫోటో ని అభిమానులతో షేర్ చేసుకున్నాడు. Many many happy returns of the day to my sweetest baby babu Ayaan . Your the love of my life. Wish u many more beautiful years to come . Love Nana అంటూ కొడుక్కి అల్లు అర్జున్ పుట్టిన రోజు విషెస్ చెప్పాడు. ఇక ఆ పిక్ లో అయాన్ కేక్ కట్ చేస్తుంటే అల్లు అర్హ కేక్ వంక ఆత్రంగా చూస్తుంది. అల్లు అర్జున్ భార్య స్నేహ, అల్లు అర్జున్ కలిసి కొడుకుతో కేక్ కట్ చేయించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తలితండ్రుల మధ్యన కేక్ కట్ చేస్తూ అల్లు అయాన్ ఆ పిక్ లో మెరిసిపోతున్నాడు.