నాట్ ఎ కామన్ మ్యాన్...ఆసక్తిరేపుతోన్న విశాల్31 అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్..
ఇటీవల చక్ర సినిమాతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం తన స్నేహితుడు ఆర్యతో కలిసి ఎనిమి సినిమా చేస్తున్నారు. ఆ సినిమా తర్వాత ఈదు థెవైయో అధువే ధర్మం అనే షార్ట్ ఫిల్మ్ తో మంచి టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తు.ప.శరవణన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషలలో ఓ భారీ సినిమా చేయబోతున్నారు. విశాల్ కెరీర్‌లో 31వ చిత్రంగా రూపొందుతున్న ఈ మూవీని విశాల్ ఫిలిం ఫ్యాక్టరి బేనర్ పై విశాల్ నిర్మిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 5గంటలకు ఈ మూవీకి సంబందించి అఫీషియల్ ఎనౌన్స్‌మెంట్ ఇచ్చారు మేకర్స్. ఈ సందర్భంగా ఒక ఇంట్రెస్టింగ్ వీడియో రిలీజ్ చేశారు. నడుస్తున్న జనసందోహం నుండి విశాల్ ఫేస్‌ని చూపించారు. దానితో పాటు నాట్ ఎ కామన్ మ్యాన్(#NotACommonMan) అనే హ్యాష్ టాగ్‌ను జోడించారు. ఈ మూవీకి యంగ్ మ్యాస్టో యువన్‌శంకర్‌రాజా సంగీతం అందిస్తుండగా బాలసుబ్రమణ్యం సినిమాటోగ్రపి భాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఎస్ ఎస్ మూర్తి ఆర్ట్ డైరెక్టర్, ఎన్ బి శ్రీకాంత్ ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు మేకర్స్.