Advertisement
Google Ads BL

నాగ్ - రష్మిక పుషప్స్ పాఠాలు


నాగార్జున తన రీసెంట్ మూవీ వైల్డ్ డాగ్ ప్రమోషన్స్ ని చాలా వెరైటీగా చేపడుతున్నారు. వైల్డ్ డాగ్ సినిమా ప్రేక్షకులు ఎంతగా రీచ్ అవ్వాలో అంతగా రీచ్ అయ్యేలా నాగార్జున ఆ సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ కి ఉన్న ఏ మార్గం నాగ్ వదలడం లేదు. తాజాగా వైల్డ్ డాగ్ ప్రమోషన్స్ లో భాగంగా నాగార్జున వైల్డ్ డాగ్ పుషప్స్ ఛాలెంజ్ అంటూ కొత్తగా సెలబ్రిటీస్ కి ఫిట్నెస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసారు. నాగ్ పుషప్స్ చేస్తూ ఆ ఛాలెంజ్ ని మరో ఫిట్ నెస్ రాణి రశ్మికకి విసిరారు. మరి ఫిట్ నెస్ లో ముందుండే రష్మిక ఊరుకుంటుందా.. తానూ కొన్ని సెకెన్స్ పాటు పుషప్స్ చేసి ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Advertisement
CJ Advs

అయితే దానికి నాగ్ స్పందిస్తూ పుషప్స్ అంటే ఇలా చెయ్యాలి.. అంటూ రష్మిక కన్నా ఎక్కువ టైం పుషప్స్ చేస్తూ తన టైమింగ్ ని అధిగమించాలంటూ ఛాలంజ్ చేసారు. దానితో కాస్త షాకయిన రష్మిక సార్ మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారో నాకిప్పుడు అర్ధమైంది.. ఎదో ఒకరోజు నేను మిమ్మల్ని బాడీగార్డ్ గా అపాయింట్ చేసుకుంటా అంటూ కామెడీ చెయ్యడమే కాదు.. నేను మీలా పుషప్స్ చెయ్యాలంటే.. ఓ ఏడాది అయినా టైం పడుతుందేమో అంటూ ట్వీట్ చేసింది రష్మిక. నాగ్ - రష్మిక ఈ పుషప్స్ సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Nagarjuna Wild Dog Push Up Challenge:

Rashmika take on Nagarjuna Wild Dog Push Up Challenge
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs