రంగ్ దే సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న కీర్తి సురేష్ ఎంతో ఉత్సాహంతో మహేష్ బాబు తో సర్కారు వారి పాట షూటింగ్ లో పాల్గొంటుంది. రీసెంట్ గా రంగ్ దే మూవీ ఇంటర్వ్యూలో మాట్లాడిన కీర్తి సురేష్ తన పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. ఈమధ్యన కీర్తి సురేష్ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ప్రేమలో ఉందని.. అనిరుద్ ని కీర్తి త్వరలోనే పెళ్లి చేసుకోబోతుంది అంటూ జోరుగా ప్రచారం జరిగింది. కీర్తి సురేష్ - అనిరుద్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి. అయితే కీర్తి మాత్రం ఆ ఫోటో లను చూసి తాను షాకయ్యాను అంటుంది.
ఇక కొంతమంది నెటిజెన్స్ అయితే సోషల్ మీడియా సాక్షిగా నాకు మూడు నాలుగు పెళ్లిళ్లు కూడా చేసేసారు. మొదట్లో నాపై వస్తున్న రూమర్స్, ఆ ఫొటోస్ చూసి షాకయ్యను. కానీ తర్వాత నవ్వుకున్నాను. అయితే ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పగలను. నా పెళ్ళికి ఇంకా సమయం ఉంది. సరైన సమయం వచ్చింది అనుకుంటే.. అప్పుడు వివాహ బంధంలోకి అడుగుపెడతాను. అది ప్రేమ పెళ్లా.. లేదా పెద్దల కుదిర్చిన వివాహమా అనేది మాత్రం చెప్పలేనటుంది మహానటి కీర్తి సురేష్.