Advertisement
Google Ads BL

మేలుకో మైత్రి మూవీస్ మేలుకో


గత రెండు రోజులుగా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మ్యానియా సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఎంతగా ట్రెండ్ అయ్యిందో చూసాం. వకీల్ సాబ్ ట్రైలర్ రికార్డ్ వ్యూస్ తో కొత్త రికార్డులని నెలకొల్పింది. పవన్ కళ్యాణ్ ఫాన్స్ పవన్ కళ్యాణ్ ని ఏ హీరో అందుకోలేంత ఎత్తులో నిలబెట్టేసారు. పవన్ క్రేజ్, ఇమేజ్ చూసి ఇతర హీరోలు కుళ్ళుకునేలా ఆయన ఫాన్స్ వకీల్ సాబ్ ట్రైలర్ ని ట్రేండింగ్ లో ఉంచి.. ఆయనకి గిఫ్ట్ ఇచ్చారు. అయితే గత రాత్రి బన్నీ ఫాన్స్ కూడా సోషల్ మీడియాలో రచ్చకు తెరలేపారు. పవన్ వకీల్ సాబ్ ట్రైలర్ మ్యానియా చూసిన అల్లు అర్జున్ ఫాన్స్ కూడా తమ హీరో సినిమా అప్ డేట్ కూడా ఇవ్వాలంటూ నిర్మాతలను తగులుకున్నారు.

Advertisement
CJ Advs

#WakeUpMythriMovieMakers అంటూ హాష్ టాగ్ ని ట్రెండ్ చేసారు బన్నీ ఫాన్స్. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా ఫిలిం పుష్ప అప్ డేట్ కావాలంటూ గత రాత్రి రచ్చ చేసారు. ట్విట్టర్ లో #WakeUpMythriMovieMakers అనే హాష్ టాగ్ తో మైత్రి మూవీస్ మేలుకో అంటూ హంగామా చేసారు. పుష్ప టీజర్ అప్ డేట్ ఇవ్వమని, పాన్ ఇండియా ఫిలిం కాబట్టి ఏదో ఒక అప్ డేట్ ఇస్తూ సినిమాకి క్రేజ్ పెంచండి అంటూ మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలను బన్నీ ఫాన్స్ ఓ రేంజ్ లో ఆడుకున్నారు. 

Wake Up Mythri Movie Makers on Twitter:

#WakeUpMythriMovieMakers hashtag trending in Twitter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs