Advertisement
Google Ads BL

పవన్ సరసన గ్లామర్ గా నిధి


పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబోలో తెరకెక్కుతున్న హరిహర వీరమల్లు సినిమాలో పవర్ స్టార్ ఎప్పుడూ కనిపించని కొత్త పాత్రలో కనిపించబోతున్నాడు. గజ దొంగగా పవన్ కళ్యాణ్ వీరత్వం హరిహర వీరమల్లు టీజర్ లో చూసాం. పవర్ ఫుల్ లుక్స్ తో పవన్ కత్తి చేతబట్టి కొత్తగా కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమాలో పవన్ సరసన ఛాన్స్ దక్కించుకున్న నిధి అగర్వాల్ పాత్ర ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటిలో పవన్ ఫాన్స్ ఉన్నారు. ఎందుకంటే ఇప్పటివరకు నిధి అగర్వాల్ గ్లామర్ పాత్రలకే పరిమితం అయ్యింది కానీ.. ఎప్పుడూ ఇలాంటి జానపద నేపథ్యం ఉన్న సినిమాల్లో కనిపించింది లేదు. అందుకే ఆమె పాత్రపై అందరిలో ఆసక్తి మొదలయ్యింది. 

Advertisement
CJ Advs

అయితే ఓ ఇంటర్వ్యూలో హరిహర వీరమల్లులో తన పాత్రపై నిధి అగర్వాల్ స్పందించింది. ఈ సినిమాలో త‌న పాత్ర చాలా బావుంటుంద‌ని.. అలాగే తన పాత్రకి ఈ సినిమాలో గ్రాండ్ కాస్ట్యూమ్స్ ఉంటాయని వివరించడమే కాదు.. త‌న పాత్ర గ్లామ‌ర్‌గా కూడా ఉంటుంద‌ని చెబుతుంది. ఇంకా పవన్ బెస్ట్ కో స్టార్ అని, ఆయన సెట్స్ లో చాలా హుషారుగా ఉంటారంటుంది. ఇకపోతే ఈ సినిమాలో మరో కీ రోల్ లో బాలీవుడ్ భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే.

Nidhhi Raves About Pawan Kalyan :

Pawan Kalyan Is Bestest Co-star
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs