Advertisement
Google Ads BL

మాస్ట్రో‌ గ్లిమ్ప్స్: నితిన్ మతిపోగొడుతున్నాడు


కరోనా తో గత ఏడాది మొత్తం నష్టపోయినా.. ఈ ఏడాది నితిన్ కి కలిసొచ్చినట్టుగా మరే హీరోకి కలిసి రాలేదనే చెప్పాలి. ఎందుకంటే రెండు నెలలో రెండు సినిమాలు విడుదల చేసిన నితిన్ మూడో సినిమాని ఈ ఏడాదే రిలీజ్ కి రెడీ చెయ్యడం అంటే మామూలు విషయం కాదు. చెక్ తో ప్లాప్ కొట్టి రంగ్ దే తో హిట్ కొట్టి.. సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న నితిన్ వరస ప్రాజెక్ట్స్ ఫాన్స్ ని ఎగ్జైట్ చేస్తున్నాయి. ఇక ఇప్పుడు మూడో సినిమా ముచ్చట కూడా  నితిన్ బర్త్ డే వేడుకల్లో భాగమైంది. ఈ రోజు ఉదయమే నితిన్ నటిస్తున్న బాలీవుడ్ రీమేక్ మాస్ట్రో టైటిల్ అండ్ లుక్ అండ్ రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసింది టీం.

Advertisement
CJ Advs

సాయంత్రానికి మాస్ట్రో‌ ఫ‌స్ట్  గ్లిమ్ప్స్  విడుద‌ల చేసింది టీం.

హీరో నితిన్ కెరీర్‌లో మైల్‌స్టోన్ 30వ చిత్రంగా మేర్ల‌పాక గాంధీ ద‌ర్శక‌త్వంలో రూపొందుతోన్న చిత్రం మాస్ట్రో.  రీసెంట్‌గా ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌తో ప్ల‌జెంట్ స‌ర్పైజ్ ఇచ్చిన త‌ర్వాత ఈ రోజు ఫ‌స్ట్ గ్లిమ్ప్స్ విడుద‌ల చేశారు మేక‌ర్స్‌.  

ఇంత‌కు ముందెన్న‌డూ చూడ‌ని విధంగా ఈ గ్లింప్స్‌లో నితిన్ క‌నిపించాడు. నితిన్ పియానో వాయించడంతో ఆహ్లాద‌క‌రంగా ప్రారంభమైన  ఫస్ట్ గ్లిమ్ప్స్  వీడియో అతన్ని ఎవరో అత‌న్ని నీటిలో ముంచి హత్య చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న సీన్ తో ముగిసింది. ఈ ప్రత్యేక క్రమంలో నితిన్ అసాధారణంగా న‌టించారు. ఈ ‌వీడియోలో మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ బీజీఎమ్ అద్భుతంగా ఉంది.  

త‌మ‌న్నా భాటియా ఓ ప్ర‌ధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నితిన్ జోడీగా న‌భా న‌టేష్ న‌టిస్తున్నారు.

2021లో క్రేజీ ప్రాజెక్టులలో మాస్ట్రో ఒకటి. రీసెంట్‌గా విడుద‌లైన నితిన్ రంగ్‌దే సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ గా మారుతోంది. ఇద్దరు క్రేజీ హీరోయిన్లు తమన్నా భాటియా,  నభా నటేష్ ఇందులో భాగమవుతున్నారు.

భీష్మ మూవీకి సూప‌ర్ హిట్ మ్యూజిక్ ఇచ్చిన మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ ఈ చిత్రానికీ సుమ‌ధుర బాణీల‌ను స‌మ‌కూరుస్తున్నారు.

Maestro 1st Glimpse Review:

Nithiin Maestro 1st Glimpse Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs