Advertisement
Google Ads BL

BB3 పై బోలెడన్ని అనుమానాలు


బాలకృష్ణ - బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న BB3 పై ఎన్ని అంచనాలైతే ఉన్నాయో అన్నే అనుమానాలు ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు BB3 షూటింగ్ విషయం క్లారిటీ లేని ఫాన్స్ కి BB3 షూటింగ్ మొదలు పెట్టినప్పటినుండి ఎలాంటి ఆటంకాలు లేకుండా సజావుగా జరుగుతుంది అని తెలిసాక కానీ కుదుట పడలేదు. మరోపక్క ఈ సినిమాని బడ్జెట్ సమస్యల, హీరోయిన్ ప్రోబ్లెంస్ ఇలా ఎప్పటికప్పుడు BB3 వార్తల్లో నిలుస్తూనే ఉంది. అన్ని సెట్ అయ్యి రిలీజ్ డేట్ ఇచ్చాక.. ఇంకా టైటిల్ విషయంలో మేకర్స్ నాన్చడం చూస్తుంటే అందరిలో అనుమానాలు మరోసారి రేజ్ అయ్యాయి.

Advertisement
CJ Advs

మే 28 రిలీజ్ అంటూ ప్రకటించేసి కామ్ అయిన BB3 మేకర్స్.. ఇంకా సినిమాని 40 శాతం పూర్తి చెయ్యాల్సి ఉందట. కేవలం రిలీజ్ కి రెండు నెలల సమయం మాత్రం ఉంది. ఈలోపు 40 శాతం షూటింగ్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పూర్తి కావడం కష్టమనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. దానితో అనుకున్న డేట్ కి BB3 రాకపోవచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఒకవేళ ఈ రెండు నెలల్లో షూటింగ్ కంప్లీట్ చెయ్యాలంటే.. BB3 షూటింగ్ కి ఎలాంటి గ్యాప్ తీసుకోకుండా చేస్తేనే వర్కౌట్ అవుతుంది కానీ.. లేదంటే కష్టం అని అంటున్నారు. 

మరోపక్క BB3 నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి పై కేసులు ఇలాంటి గందర గోళంలో సినిమా అనుకున్న టైం కి రాకపోవచ్చని అనుమానాలు గట్టిగా బలపడుతున్నాయి. BB3 కి గాడ్ ఫాదర్ టైటిల్ పెట్టబోతున్నారని అన్నా.. ఇప్పటివరకు టైటిల్ విషయం ఏమి తేల్చకుండా ఇలా సైలెంట్ గా ఉంటే ఇలాంటి అనుమానాలే వస్తాయి. అందుకే BB3 అప్ డేట్ ఇవ్వండి అంటూ బోయపాటి వెంటపడుతున్నారట నందమూరి ఫాన్స్.

 

Nandamuri fans Confused?:

BB3 makers locked Godfather as official title?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs