ఏప్రిల్ 2 బాక్సాఫీసు బరి నుండి గోపీచంద్ సీటిమార్ తప్పుకోవడంతో నాగార్జున వైల్డ్ డాగ్ సోలోగా థియేటర్స్ లోకి వస్తుంది. గత వారం విడుదలైన సినిమాల్లో నితిన్ రంగ్ దే కలెక్షన్స్ పరంగా దూసుకుపోతుంది. అరణ్య, తెల్లవారితే గురువారం సినిమాల కలెక్షన్స్ డల్ అయ్యాయి. ఇక ఈ వారం కేవలం నాగ్ నటించిన వైల్డ్ డాగ్ మాత్రమే తెలుగులో రిలీజ్ అవుతున్న సినిమా. అయితే నాగ్ కి పోటీగా తమిళ్ హీరో కార్తీ సుల్తాన్ కూడా అదే రోజు విడుదల కాబోతుంది. కార్తీ కేవలం తమిళ్ లోనే కాదు.. తెలుగులోనూ హీరోగా నటించాడు. అది కూడా నాగార్జున తో కార్తీ వంశి పైడిపల్లి దర్శకత్వంలో ఊపిరి సినిమాలో నటించాడు. నాగ్ ని చూసుకునే తమ్ముడిగా కార్తీ ఆ సినిమాలో కనిపించాడు.
మరి ఒకే సినిమాలో అన్నదమ్ములుగా నటించిన నాగ్ - కార్తీ ఇప్పుడు వేర్వేరుగా బాక్సాఫీసు దగ్గర పోటీకి దిగుతున్నారు. నాగార్జున వైల్డ్ డాగ్ తో వస్తుంటే.. కార్తీ సుల్తాన్ సినిమా తో వస్తున్నాడు. నాగార్జున వైల్డ్ డాగ్ మీద ఎంత క్రేజ్ ఉందొ.. కార్తీ సుల్తాన్ మీద కూడా అంతే క్రేజ్ ఉంది. ఖైదీ లాంటి హిట్ ఉన్న కార్తీ సక్సెస్ ఫుల్ హీరోయిన్ రష్మిక తో జోడి కట్టడం సుల్తాన్ సినిమాకి మరింత ఆకర్షణ కానుంది. ఇక నాగ్ వైల్డ్ డాగ్ ప్రమోషన్స్ గత 20 రోజులుగా సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తున్నాయి. మరి ఈ వారం ఈ అన్నదమ్ముల్లో ఏ హీరో విన్ అవుతాడో చూద్దాం.