Advertisement
Google Ads BL

రవితేజ ఖిలాడీకి బ్రేకులు


రవితేజ - రమేష్ వర్మ కాంబోలో తెరకెక్కుతున్న ఖిలాడీ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఖిలాడీ సినిమాలో రవితేజ డ్యూయెల్ రోల్ చేస్తున్నాడని.. అందులో ఒక పాత్రలో రవితేజ  లాయర్  కనిపించనున్నాడని టాక్ ఉంది. ప్రస్తుతం ఇటలీలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా షూటింగ్ కి బ్రేకులు పడినట్లుగా టాక్. ఎందుకంటే కరోనా సెకండ్ వెవ్ ఇటలీలో ఎక్కువగా ఉండడంతో.. అక్కడ రవితేజ సినిమాకి సంబంధిచిన ఖిలాడీ షూటింగ్ జరిగే ప్రదేశంలో లాక్ డౌన్ పెట్టడడంతో ఇప్పుడు ఈ షూటింగ్ కి బ్రేకులు పడినట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

ఇటలీలో ఖిలాడీకి సంబందించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తి కావాల్సి ఉండగా.. ఇప్పుడు కరోనా కేసులు ఎక్కువడంతో ఇటలీలో కొన్ని ప్రదేశాల్లో లాక్ డౌన్ విధించడంతో రవితేజ ఖిలాడీ షూటింగ్ కూడా ఆగిపోయినట్లుగా సమాచారం. 

ఇటలీలో మరో వారం షూటింగ్ బాలన్స్ ఉండగా.. ఇప్పుడు లాక్ డౌన్ విధించడంతో ఖిలాడీ టీం మళ్ళీ హైదరాబాద్ తిరిగివచ్చే ప్లాన్ లో ఉందట. మళ్ళీ పరిస్థితులు చక్కబడిన తర్వాతే షూటింగ్ చేసుకుందామని అనుకుంటున్నారట. మరి శరవేగంగా షూటింగ్ పూర్తి చేసి మే 28న సినిమాని రిలీజ్ కి సిద్ధం చెయ్యాలని అనుకుంటున్న టీం కి కరోనా ఝలక్ ఇచ్చేలా కనిపిస్తుంది.

Ravi teja Khiladi Shooting break in Italy:

Mass Maharaj Ravi teja Khiladi Shooting break in Italy
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs