Advertisement
Google Ads BL

ఏం న్యాయం నందాజి అంటున్న వకీల్ సాబ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ మరో పది రోజుల్లో ఫాన్స్ ని సర్ప్రైజ్ చెయ్యడానికి రెడీ గా ఉంది. ప్రస్తుతం ప్రమోషన్స్ జోరుగా సాగుతున్న వకీల్ సాబ్ నుండి ట్రైలర్ ని రిలీజ్ చేసింది టీం. పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ అనగానే ఫాన్స్ లో సినిమాపై, పవన్ పై భీబత్సమైన అంచనాలు వచ్చేసాయి. అదే అంచనాలతో వకీల్ సాబ్ ట్రైలర్ మేటర్ ని ఈ రోజు ఉదయం నుడి సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు పీకే ఫాన్స్. కొద్ది నిమిషాల క్రితమే విడుదలైన వకీల్ సాబ్ ట్రైలర్ లో ముగ్గురమ్మాయిల కి సపోర్ట్ గా ఓ లాయర్ కనిపిస్తున్నారు. తాను వాదిస్తున్నది ఓ పవర్ ఫుల్ లాయర్ తో అని తెలిసి.. విలన్ కి న్యాయం చెయ్యాలనే అపోజిషన్ లాయర్ కి ధీటుగా ఎదుర్కొని ఆ ముగ్గురమ్మాయిలకి న్యాయం చేసే లాయరు కథే వకీల్ సాబ్. అంజలి, నివేత థామస్, అనన్య నాగల్ల అనే అందమైన ముగ్గురమ్మాయిలను కోర్టులో నిలబెట్టి.. విలన్ తరుపు వ్యయవాదిగా కనిపిస్తున్న ప్రకాష్ రాజ్ అడిగే ప్రశ్నలకు ఓ సామాన్యమైన లాయర్ గా కనిపించే పవన్ కళ్యాణ్ ఇచ్చే సమాధానాలు.. అబ్బో అద్భుతంగా ఉన్నాయి.

Advertisement
CJ Advs

ప్రకాష్ రాజ్ నివేత థామస్ ని నువ్వు వర్జిన్ వా.. అందరికి వినబడేలా చెప్పండి మీరు వర్జినా.. అని అడుగుతారు. నివేత, అంజలి, అనన్య హ్యాపీ గా ఉండే ముగ్గురు అమ్మాయిలు.. పుట్టిన రోజు పార్టీ అంటూ హడావిడి చేస్తూ.. సంతోషంగా గడిపేసే వారి జీవితంలో అనుకోని కుదుపు వారిని కోర్టు పాలు చేస్తుంది. అక్కడ కోర్టులో ప్రకాష్ రాజ్ (నందా) vs పవన్ కళ్యాణ్ (సత్యదేవ్) అన్నట్టు సాగే వాదనలు హైలెట్ అనేలా ఉన్నాయి. అమ్మాయిలకు బ్యాగ్రౌండ్ ఏం లేదు.. ఉత్త మిడిల్ క్లాస్ ఏది చేసినా పడుంటారనుకునే విలన్, జెడ్జ్ ని కలిసి ఎమెర్జెన్సీ బెయిల్ వస్తుంది అనుకునే అమ్మాయిలకి సత్యదేవ్ అండగా నిలబడతాడు. పల్లవిని ఉద్దేశించి పవన్ చెప్పే డైలాగ్ మీకు వీళ్ళు ఎలా పరిచయం అయ్యారు, ఎక్కడ కలిశారు అని చాలా సాఫ్ట్ గా అడిగే విధానం చూసి స్మూత్ గా డీల్ చేసే లాయరు అనుకుంటే పొరబాటే.. ఇలాంటి అమ్మాయిలకు ఇలానే జరుగుద్ది అంటే ఆలా జరగదు జరగకూడదు అంటూ పవర్ ఫుల్ లుక్స్ తో విలన్స్ ని చితక్కొట్టేసే లాయర్ సాబ్.. మెట్రో ట్రైన్ లో చేసిన ఫైట్ అదుర్స్.  

వంశి బాలకృష్ణని పవన్ ఆర్ యు వర్జిన్ అని అడిగితే.. దానికి ప్రకాష్ రాజ్ అబ్జెక్షన్ అంటూ లేవడం, మీరైతే అమ్మాయిలను అడగొచ్చు మేమైతే అబ్బాయిలను అడగ కూడదా.. ఏం న్యాయం నందా జీ.. కూర్చోండి, కూర్చోండి చాలు అంటూ పవన్ ఇన్నోసెంట్ గా పవర్ ఫుల్ గా చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. వకీల్ సాబ్ మొత్తానికి హైలెట్ థమన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ట్రైలర్ లో హీరోయిన్స్ అంజలి, నివేత, అనన్యలకు కావాల్సినంత ప్రాధ్యానత ఇచ్చి.. ఇందులో పవర్ స్టార్ హీరోయిజం మాత్రమే కాదు.. అంటూ పింక్ రీమేకే వకీల్ సాబ్ అంటూ రుజువు చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ఫాన్స్ కే కాదు.. ప్రేక్షకులకూ ఎప్పుడెప్పుడు సినిమా చూసేద్దామా అనే క్యూరియాసిటీ పెరిగిపోతుంది.

Click Here to: Vakeel Saab trailer 

Vakeel Saab Trailer Review:

Pawan Kalyan Vakeel Saab Trailer Review
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs