Advertisement
Google Ads BL

నితిన్ ముందు తలవంచిన హీరోలు


మార్చ్ 11 న విడుదలైన మూడు సినిమాల్లో జాతి రత్నాలకు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే శర్వానంద్ శ్రీకారం మూవీకి మంచి టాక్ వచ్చింది. అలాగే గాలి సంపత్ కి నెగెటివ్ టాక్ రావడంతో వారానికే ఓటిటికి వెళ్ళిపోయింది. అయితే జాతి రత్నాల ముందు శ్రీకారం కూడా ఓడిపోయింది. మళ్ళీ గత శుక్రవారం విడుదలైన నితిన్ రంగ్ దే, రానా అరణ్య, సింహ కోడూరి తెల్లవారితే గురువారం సినిమాల పరిస్థితి కూడా అలానే ఉంది. నితిన్ రంగ్ దే సునామీలో అరణ్య, తెల్లవారితే గురువారం సినిమాలు అడ్రెస్స్ లేకుండా పోయాయి. రానా అరణ్య పర్లేదనిపించినా రంగ్ దే కలెక్షన్స్ ముందు సైలెంట్ గా ఉండిపోయింది.

Advertisement
CJ Advs

మరోపక్క రాజమౌళి ఫ్యామిలీ నుండి హీరో, మ్యూజిక్ డైరెక్టర్ కొడుకు సింహ కోడూరి హీరోగా సినిమా అనగానే అందరిలో ఇంట్రెస్ట్ కనబడినా.. తెల్లవారితే గురువారంలో ఇంట్రెస్టింగ్ మేటర్ లేకపోవడంతో ఆ సినిమా తెల్లారిపోయింది. విడుదలకు ముందు మంచి బజ్ ఉన్నా తెల్లవారితే గురువారం సినిమా విడుదలయ్యాక నెగెటివ్ టాక్ తో ఆ బజ్ మొత్తం ఎగిరిపోయింది. మరోపక్క నితిన్ సినిమాకి పాజిటివ్ టాక్ పడడంతో అరణ్య - తెల్లవారితే గురువారం సినిమాలకు బుకింగ్స్ లేక కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. కనీసం సో సో టాక్ వచ్చినా బడ్జెట్ గిట్టుబాటు అయ్యేది. మరీ నెగెటివ్ టాక్ రావడంతో అరణ్య, తెల్లారితే గురువారం సినిమాల థియేటర్స్ మొత్తం బోసిపోయాయి.

Rang De Tsunami at Box Office:

Nithin Rang De Tsunami at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs