Advertisement
Google Ads BL

లుక్స్ ఎలా ఉంటేనేం.. రొమాంటిక్‌గా బావుంది


ఈమధ్యన సోషల్ మీడియాలో మహానటి కీర్తి సురేష్ పోస్ట్ చేసే ఫొటోస్ చూస్తుంటే అమ్మో కీర్తి సురేష్ ఏమిటి ఇలా ఉంది.. ఇంత అంద విహీనంగా తయారైంది. గ్లామర్ ఉంది.. కానీ గ్లో లేదు.. మొహం లో కళ లేదు అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మిస్ ఇండియా కోసం కీర్తి సురేష్ వర్కౌట్స్ చేసి చిక్కి పోయింది. మంచిగా సన్నగా నాజూగ్గానే ఉన్నా కీర్తి సురేష్ బరువు తో పాటు గ్లో కూడా పోగొట్టుకుంది. కీర్తి సురేష్ ఇలా ఉంటే మహేష్ సర్కారు వారి పాట లోమహేష్ ముందు తేలిపోతుంది అని మహేష్ ఫాన్స్ తెగ కంగారు పడుతున్నారు. 

Advertisement
CJ Advs

అయితే రీసెంట్ గా విడుదలైన రంగ్ దే మూవీలో కీర్తి సురేష్ సన్నగా నాజూగ్గా ఉన్నప్పటికీ.. మొహం లో గ్లో ఎలా ఉన్నా, ఆమె నితిన్ తో రొమాంటిక్ గాను, అలాగే చిరు కోపంతో అదరగొట్టేసింది. కీర్తి సురేష్ అల్లరి,. నితిన్ - కీర్తి సురేష్ మధ్యన కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. కీర్తి సురేష్ - నితిన్ జోడికి వాళ్ళ రొమాంటిక్ యాంగిల్ కి మంచి మార్కులేస్తున్నారు ప్రేక్షకులు. పెంగ్విన్, మిస్ ఇండియా వంటి ప్లాప్స్ తోనూ, ఫేస్ లో గ్లో లేని కీర్తి సురేష్ అంటే మహేష్ ఫాన్స్ భయపడినా.. ఇప్పుడు రీసెంట్ గా రంగ్ దే తో హిట్ కొట్టిన కీర్తి సురేష్ ని పొగుడుతున్నారు. హమ్మయ్య సర్కారు వారి పాట కొచ్చేసరికి కీర్తి సురేష్ కి రంగ్ దే లాంటి కలర్ ఫుల్ హిట్ ఉంది.. ఇక భయమేలా అనుకుంటున్నారు.

Mahesh Babu fans Comments on Keerthi Suresh Look:

Keerthi Suresh gets hit with Rang De Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs