Advertisement
Google Ads BL

రష్మికా ఏంటా అవతారం? అలా అయిపోయావేంటి?


తెలుగులోనే కాదు.. బాలీవుడ్‌లోనూ యంగ్ స్టర్స్ తో సినిమాలు చేస్తున్న రష్మిక మందన్న ఫిట్ నెస్ విషయంలో ఎప్పుడూ వార్తల్లోనే ఉంటుంది. గ్లామర్ గా జిమ్ డ్రెస్సులతో అదరగొట్టే రష్మిక.. ఈ మధ్యన విజయ్ దేవరకొండతో డిన్నర్ డేట్‌కి వెళ్లి హాట్ టాపిక్ అయ్యింది. రష్మిక - విజయ్ డిన్నర్ డేట్ కి వెళ్లడం చూసిన వారు వారి మధ్యలో లవ్ ఉందని ఫిక్స్ అయిపోతున్నారు. అయితే రష్మిక రీసెంట్ గా తమిళంలో నటించిన కార్తీ సుల్తాన్ ఏప్రిల్ 2న విడుదలకు సిద్ధమవుతుంది. ఆ సినిమాలో కార్తీకి జోడిగా రష్మిక నటించింది. డీ గ్లామర్ గా కనిపించే రష్మిక లంగా వోణితో బాగానే హైలెట్ అయ్యింది.

Advertisement
CJ Advs

 

అయితే రష్మిక.. సుల్తాన్ ట్రైలర్ లో లుక్స్ పరంగా తేలిపోయింది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బుగ్గలు లోపలికి పోయి.. లంగా వోణిలో రష్మికని చూస్తే కర్రకు లంగావోణీ వేసిన ఫీలింగ్ వస్తుంది కానీ.. రష్మిక లుక్ పరంగా ఓహో అనిపించేలా లేదు అంటున్నారు. గ్లామర్ తక్కువైనా పెరఫార్మెన్స్ తో నడిపించేసే రష్మిక కార్తీకి జోడిగా తేలిపోయింది అనే కామెంట్స్ ఎదుర్కొంటుంది. సుల్తాన్ లో రష్మిక లుక్స్ పరంగా బాలేదని.. కాస్త చబ్బీ గా కనిపిస్తే రష్మిక బావుండేది కానీ.. మరీ పల్చగా ఆ కట్టు బొట్టు అన్ని తేలిపోయాయనే విమర్శలు రైజ్ అయ్యాయి. మరి ట్రైలర్లో ఇలా ఉంటే.. సినిమాలో ఇంకేం స్పెషల్ ఉంటుంది. సినిమాలోనూ రష్మిక అదే లుక్స్‌తో కనిపిస్తుంది. ఇకనైనా ఆమె తన ఫిజిక్‌పై దృష్టి పెడుతుందేమో చూద్దాం. 

Trolling on Rashmika Makeover in Sulthan Movie :

Fans unhappy with Rashmika Avathar in Sulthan Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs