Advertisement
Google Ads BL

నన్ను కొత్తగా చూస్తారంటున్న రకుల్


తెలుగులో వైష్ణవ తేజ్ తో నటించిన క్రిష్ సినిమా తప్ప మరో సినిమా లేదు రకుల్ ప్రీత్ చేతిలో. అయినా బాలీవుడ్ లో మూడు సినిమాలతో బిజీగా ఉన్న రకుల్ ప్రీత్ అక్కడ జిమ్ లో వర్కౌట్స్ చెయ్యడానికి జిమ్ డ్రెస్సులతో గ్లామర్ షో చెయ్యడమే కాదు.. హౌస్ పార్టీలు, అలాగే బర్త్ డే పార్టీలు అంటూ బాలీవుడ్ కల్చర్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. అయినా సోషల్ మీడియా లో ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే రకుల్.. ఎప్పటికప్పుడు గ్లామర్ ఫొటోస్ తో అదరగొట్టేస్తుంది. 

Advertisement
CJ Advs

అయితే  గత ఏడాది లాక్ డౌన్ తో మూతబడిన థియేటర్స్ ఈ ఏడాది థియేటర్స్ తెరుచుకుని మళ్ళీ పూర్వ వైభవం చూస్తున్నామంటూ సంతోషం వ్యక్తం చేస్తుంది. థియేటర్స్ ఓపెన్ అయ్యి, థియేటర్స్ వ్యవస్థ బావుంటేనే.. దానిపై ఆధారపడ్డ చాలామంది కి పని దొరుకుతుంది. కరోనా పరిస్థితిలు చక్కబడి.. ప్రపంచం మళ్లీ పూర్వ స్థితికి వస్తుంది అనే నమ్మకం, ఆశ ఉన్నాయంటుంది రకుల్. అలాగే బాలీవుడ్ లో తాను నటిస్తున్న మేడే, థ్యాంక్ గాడ్, ఎటాక్ సినిమాల్లో చేస్తున్న మూడు పాత్రలు విభిన్నమైనవే అని.. మూడు సినిమాల్లో నన్ను కొత్తగా చూస్తారు అంటుంది రకుల్.

Rakul about cinema theaters:

Rakul Preet about cinema theaters
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs