ఈ రోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో మెగా ఫాన్స్ ఎక్కడికక్కడ కేక్ కటింగ్స్ తో చరణ్ కి విషెస్ చెబుతున్నారు. నిన్నటికి నిన్న చరణ్ ఇంటికి చేరుకున్న ఫాన్స్ రామ్ చరణ్ కి శుభాకాంక్షలు తెలియజేసారు. సోషల్ మీడియా మొత్తం రామ్ చరణ్ కి విషెస్ చెబుతూ ప్రముఖుల ట్వీట్స్ తో నిండిపోయింది. ఇక రామ్ చరణ్ పుట్టిన రోజు కి RRR నుండి అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ కి అదిరిపోయే పోస్టర్ ట్రీట్ ఇచ్చింది టీం. అలాగే ఆచార్య నుండి సిద్ద లుక్ రివీల్ చేసారు. అయితే రామ్ చరణ్ బర్త్ డే వేడుకలు RRR సెట్స్ లో అదిరిపోయే లెవల్లో జరిగాయి.
రాజమౌళి ఆయన కొడుకు కార్తికేయ, ఇంకా ఆర్.ఆర్.ఆర్ టీం అంతా చరణ్ తో కేక్ కట్ చేయించి విషెస్ చెప్పారు. మరి అల్లూరి సీతారామరాజు పుట్టిన రోజు వేడుకల్లో కొమరం భీం అదేనండి తారక్ మిస్ అయ్యాడు. అల్లూరి గా చరణ్, కొమరం భీం గా ఎన్టీఆర్ నటిస్తున్న ఆ ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఓ కొలిక్కి వచ్చింది. ప్రస్తుతం క్లయిమాక్స్ షూట్ లో ఉన్న ఆర్.ఆర్.ఆర్ సెట్స్ లో చరణ్ బర్త్ డే వేడుకలు నిర్వహించారు. అందులో ఎన్టీఆర్ మిస్ అవడంతో మెగా ఫాన్స్ కాస్త ఫీలయ్యారు. అక్కడ చరణ్ పుట్టిన రోజు వేడుకలు జారుగుతున్న సమయంలో ఇక్కడ సోషల్ మీడియాలో ఎన్టీఆర్ రామ్ చరణ్ తో క్లోజ్ గా ఉన్న పిక్ పోస్ట్ చేస్తూ ఈ ఏడాది మా ఇద్దరికీ ఎంతో గొప్పగా ఉండబోతుంది.. హ్యాపీ బర్త్ డే చరణ్ అంటూ ట్వీట్ చెయ్యడంతో మెగా ఫాన్స్ ఊపిరి తీసుకున్నారు. మరి భీం అల్లూరిని విష్ చేసిన ఆ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.