Advertisement
Google Ads BL

వేదం నాగయ్య ఇక లేరు


అల్లు అర్జున్ - మంచు మనోజ్ - అనుష్క కీలక పాత్రల్లో దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన వేదం సినిమాలో.. మనవడిని తాకట్టు నుండి విడిపించుకోవడానికి.. కోడలు కిడ్నీ అమ్మి డబ్బు తీసుకుంటే.. అది కాస్తా దొంగలు కొట్టేయడంతో ఆ ముసలి ప్రాణం పడే వేదన అంతా ఇంతా కాదు.. ఆ పాత్రలో నటుడు నాగయ్య అదరగొట్టేసాడు. వ్యవసాయం సరిగ్గా పండక హైదరాబాద్ కి వలస వచ్చిన నాగయ్యని చూసి క్రిష్ తన వేదం సినిమాలో అద్భుతమైన రోల్ ఇవ్వడంతో అప్పటినుండి నాగయ్య అనేక సినిమాలో మెప్పించారు. ఎన్ని సినిమాలలో నటించినా ఆయన పేరు వేదం నాగయ్యగానే స్థిరపడిపోయింది. 

Advertisement
CJ Advs

రీసెంట్‌గా నాగయ్య భార్య అనారోగ్యంతో కన్నుముయ్యడం, సినిమాల్లో అవకాశాలు లేకపోవడంతో పూట గడవడమే కష్టంగా మారిన నాగయ్యకి కేసీఆర్, మా అసోసియేషన్ కూడా అండగా నిలిచారు. అయితే భార్య మరణం తర్వాత మానసికంగా కుంగిపోయిన నాగయ్య అనారోగ్యంతో ఈ రోజు తెల్లవారి ఝామున తుదిశ్వాస విడిచారు. నాగయ్య మృతికి సినీ ఇండస్ట్రీలోని ప్రముఖులు సంతాపం వ్యక్తం చేసారు.

Vedam Nagaiah is no more:

Vedam Nagaiah is no more
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs