Advertisement
Google Ads BL

మెగా ఫాన్స్ కి మరో ట్రీట్ రెడీ


రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు శిల్పకళా వేదికలో ఆహా అనిపించేలా జరిగాయి. సాయి ధరమ్ తేజ్, వైష్ణవ తేజ్ లు హాజరై ఫాన్స్ లో జోష్ నింపారు. ఇక రామ్ చరణ్ అయితే తన ఇంటి దగ్గరే ఫాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యాడు. బాలీవుడ్ హీరోస్ స్టయిల్ ల్లో రామ్ చరణ్ గేట్ ఎక్కి మరీ అభిమానులకి సలాం కొట్టాడు. అంతేకాదు అభిమానులని పలకరిస్తూ అందరి విషెస్ అందుకున్నాడు. అయితే రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా ఒక రోజు ముందే మెగా ఫాన్స్ కి ఆయన నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం RRR నుండి అదిరిపోయే ట్రీట్ వచ్చేసింది. అల్లూరి సీతా రామరాజు గా రామ్ చరణ్ ఉగ్రరూపాన్ని చూపించారు.

Advertisement
CJ Advs

మరి ఆర్. ఆర్. ఆర్ నుండి అదిరిపోయే ట్రీట్ వచ్చాక మెగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఆ సెలెబ్రేషన్స్ లో ఉండగానే రామ్ చరణ్ నటిస్తున్న మరో మూవీ ఆచార్య నుండి ట్రీట్ ని సిద్ధం చేసినట్లుగా ఆచార్య టీం అనౌన్స్ చేసింది. ఆచార్య లో రామ్ చరణ్ సిద్ధగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు సిద్ధగా రామ్ చరణ్ బ్యాక్ లుక్ తోనే సరిపెట్టిన ఆచార్య టీం.. రేపు 9.27 నిమిషాలకు రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్ గా ట్రీట్ ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించింది. అది చూసిన మెగా ఫాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. రామ్ చరణ్ పుట్టిన రోజునాడు ఇలా వరస ట్రీట్స్ చూసి మెగా ఫాన్స్ ఖుషి అవుతున్నారు.

Ram Charan as Siddha in Acharya movie Mega Massive Look:

Ram Charan as Siddha in Acharya movie Mega Massive Look unveiling, at 9:27 AM Tomorrow
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs