Advertisement
Google Ads BL

రంగ్ దే ముందు.. గురువారం నిలుస్తుందా


ఈ రోజు నితిన్ - కీర్తి సురేష్ జంటగా నటించిన రంగ్ దే కలర్ ఫుల్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్నింగ్ షో కే పాజిటివ్ టాక్ రావడం, క్రిటిక్స్ నుండి కూడా పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావడంతో రంగ్ దే హిట్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. మార్నింగ్ షో కన్నా మ్యాట్నీ, ఫస్ట్ షో కి మరిన్ని కలెక్షన్స్ పెరిగాయంటూ రంగ్ దే టీమ్ చెబుతుంది. సినిమాలో నితిన్ - కీర్తి సురేష్ కెమిస్ట్రీకి 100 మార్కులు పడుతుంటే.. బ్రహ్మాజీ, సుహాస్, వ్వెన్నెల కిషోర్ కామెడీ టైమింగ్స్ అదుర్స్ అనేలా ఉంది. అలాగే నితిన్ కూడా రొమాంటిక్ గా కామెడీ గాను అదరగొట్టేసాడు. ఇంకా దర్శకుడు కథ మీద శ్రద్ద తీసుకుని ఉంటే రంగ్ దే హిట్ కాదు.. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది అంటూ ప్రేక్షకులు అంటున్న మాట. 

Advertisement
CJ Advs

మరి గత వారం సినిమాలు డల్ గా ఉండడం, సినిమాపై అంచనాలు ఉండడంతో పాటుగా సినిమా కి వచ్చిన టాక్ కూడా మంచి హెల్ప్ అయ్యిది. ఇక రానా అరణ్య కి అనుకున్నంత పాజిటివ్ టాక్ పడలేదు. క్రిటిక్స్ నుండి మిక్స్డ్ రివ్యూస్ పడినాయి. అయితే రేపు విడుదల కాబోతున్న సింహ కోడూరి తెల్లవారితే గురువారం మూవీ నితిన్ రంగ్ దే తట్టుకుని నిలబడుతుందా అనేది సందేహమే. ఎందుకంటే మత్తు వదలరా సినిమాతో మెప్పించిన సింహ కోడూరి ఇప్పుడు తెల్లవారితే గురువారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. హిట్ బ్యాగ్ రౌండ్ ఫ్యామిలీ నుండి వస్తున్నా.. సినిమాపై ఓ అన్నంత హైప్ గాని క్రేజ్ కానీ లేదు. టీం ఎంతగా సినిమాని ప్రమోట్ చేసినా.. నితిన్ రంగ్ దే పాజిటివ్ టాక్ ని తట్టుకుని నిలబడడం మాటలను కాదంటున్నాయి ట్రేడ్ వర్గాలు కూడా. సినిమాకి మంచి టాక్ పడితే తప్ప లేదంటే కష్టం. 

 

In front of Rang De, will Thellavarithe Guruvaram show its talent:

Nithin Rang De success celebrations
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs