Advertisement
Google Ads BL

పవన్ ఫాన్స్ కి గుడ్ న్యూస్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తియ్యడమనే కలను సాకారం చేసుకున్నాడు దిల్ రాజు. పింక్ రీమేక్ ని ఎలాగో ఏడాదికి పూర్తి చేసి ప్రేక్షకులముందుకు తీసుకురాబోతున్నాడు. పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ వకీల్ సాబ్ పై ఫాన్స్ లో, ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఎంతగా అంచనాలున్నా సినిమాకి ప్రమోషన్స్ ఇంపార్టెంట్. అయితే పవన్ కళ్యాణ్ సినిమాలో నటించడం వరకు ఓకె. కానీ ప్రమోషన్స్ కి రాడు. అయితే ఇప్పుడు దిల్ రాజు కోరిక మేరకు పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూ ఇచ్చేశాడట. వకీల్ సాబ్ ట్రైలర్ కన్నా ముందే పవర్ స్టార్ వకీల్ సాబ్ ఇంటర్వ్యూ జరిగిపోయిందట.

Advertisement
CJ Advs

దిల్ రాజు ఆ ఇంటర్వ్యూ ని ఎప్పుడు ఛానల్స్ కి ఇస్తారో తెలియదు కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం ఓ గంట వకీల్ సాబ్ ఇంటర్వ్యూ ఇచ్చాడట. వకీల్ సాబ్ ఏప్రిల్ 9 న విడుదల కాబోతుంది. అప్పుడు ప్రమోషన్స్ అంటే పవన్ కళ్యాణ్ వేరే సినిమా షూటింగ్స్ బిజీలో దొరుకుతారో లేదో అని.. దిల్ రాజు తెలివిగా ప్లాన్ చేసి మరీ పవన్ ఇంటర్వ్యూ తీసుకున్నాడట. మరి ఏప్రిల్ 3 న వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ తో పాటుగా ఇతర గెస్ట్ లు కూడా రాబోతున్నారనే  న్యూస్ ఉన్నా.. కరోనా నేపథ్యంలో భారీఎత్తున వకీల్ సాబ్ ఈవెంట్ జరుగుతుందో.. లేదో.. అనే కన్ఫ్యూజన్ లో ఫాన్స్ ఉన్నారు. ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారనగానే ఫాన్స్ కి ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసింది. నిజంగా ఫాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. 

Good News For Power Star Fans!:

Pawan Vakeel Saab Interview
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs