రామ్ చరణ్ బర్త్ డే కి RRR టీం స్పెషల్ ట్రీట్ ఒక రోజు ముందుగానే ఇచ్చేసింది. మెగా ఫాన్స్ ఎక్సపెక్ట్ చెయ్యని ట్రీట్ RRR మూవీ నుండి ఫాన్స్ అందుకున్నారు. గత ఏడాది చరణ్ పుట్టిన రోజునాడు అల్లూరి సీతారామరాజుగా పోలీస్ లుక్ ని ఓ వీడియో ద్వారా పరిచయం చేసింది టీం. అందులో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ బాక్సింగ్, సిక్స్ ప్యాక్ బాడీ అన్నీ ఆకట్టుకున్నాయి. మరి ఈ ఏడాది చరణ్ పుట్టిన రోజుకి ఒక రోజు ముందుగానే RRR నుండి మెగా ఫాన్స్ ట్రీట్ అందుకున్నారు.
ఈ రోజు సాయంత్రం 4 గంటలకు RRR మూవీ నుండి రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గెటప్ ఉన్న పోస్టర్ ని రిలీజ్ చేసింది. అందులో విల్లు చేతబట్టి.. బాణం వదులుతున్న పోస్టర్ లో చరణ్ అల్లూరి గా అదరగొట్టేసాడు. కండలు తిరిగిన దేహంతో రామ్ చరణ్ నిజంగా అద్భుతం అనిపించాడు. RRR నుండి రామ్ చరణ్ అల్లూరి పోస్టర్ చూసి మెగా ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అబ్బ మా చరణ్ పుట్టిన రోజుకి ఒక రోజు ముందే మాకు ట్రేట్ ఇచ్చేసారు.. థాంక్యూ రాజమౌళి సార్ అంటూ తెగ ఆనందపడిపోతున్నారు.