Advertisement
Google Ads BL

చరణ్ RRR స్పెషల్ ఈ రోజే


రామ్ చరణ్ బర్త్ డే వేడులకు తెలుగు రాష్ట్రాల్లో మెగా ఫాన్స్ ఆకాశాన్ని అంటే సంబరాలతో కేక్ లు కట్ చెయ్యడానికి రెడీ అయ్యిపోతున్నారు. ఇప్పటికే చరణ్ పుట్టిన రోజు స్పెషల్ గా ఈ రోజు సాయంత్రం శిల్పకళా వేదికలో రామ్ చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఓ రేంజ్ లో చేస్తుంటే.. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా ఫిలిం నుండి చరణ్ బర్త్ డే స్పెషల్ రాబోతుంది. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకే రామ్ చరణ్ కి ఆర్ ఆర్ ఆర్ నుండి బర్త్ డే గిఫ్ట్ సిద్ధం చేసినట్టుగా RRR టీమ్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. దానితో మెగా ఫాన్స్ ఆనందానికి అవధుల్లేవు. 

Advertisement
CJ Advs

రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా ఆయన పుట్టిన రోజునాడు రాజమౌళి ఇవ్వబోయే ఆ స్పెషల్ ఏమిటో? వీడియో ఏమైనా ఇస్తారా? లేదంటే పోస్టర్ తో సరిపెడతారా? అనే క్యూరియాసిటిలో చాలా ఆతృతగా ఎదురు చూడడమే కాదు.. రామ్ చరణ్ బర్త్ డే హాష్ టాగ్ సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉండేలా చూస్తున్నారు. రేపు బర్త్ డే అయితే ఈరోజే రామ్ చరణ్ పుట్టిన రోజు సంబరాలు మొదలయ్యాయి. ఇక RRR నుండి ఆయన బర్త్ డే స్పెషల్ తేలిపోయింది. ఇక ఆచార్య నుండి రామ్ చరణ్ లుక్ రివీల్ చెయ్యబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆచార్య నుండి రామ్ చరణ్ సిద్ద లుక్ ని రేపు విడుదల చేసే ప్లాన్ లో ఆచార్య టీం ఉంది. సిద్ద లుక్ తోనే ఆయనకి బర్త్ డే విషెస్ చెప్పబోతోంది టీం. అయితే ఆచార్య నుండి సిద్ద టీజర్ వదిలితే బావుంటుంది.. అంటున్నారు మెగా ఫాన్స్. ఏది ఏమైనా రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు సోషల్ మీడియాలో ఈ రెండు రోజులు ట్రెండ్ అవడం ఖాయంగా కనిపిస్తుంది.. ఎందుకంటే అటు ఆయన నటిస్తున్న మూవీ స్పెషల్ ట్రీట్స్ తో పాటుగా ఫాన్స్ హంగామాతో సోషల్ మీడియాని షేక్ చెయ్యాలని గట్టిగ కూర్చున్నారు ఫాన్స్.

Mega Power Star Ram Charan Fire new avatar, at 4 pm today:

Mega Power Star Ram Charan Fire new avatar, at 4 pm today
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs