Advertisement
Google Ads BL

లాంగ్ వీకెండ్.. క్యాష్ చేసుకునేది ఎవరో


రేపు శుక్రవారం ఎప్పటిలాగే నాలుగు సినిమాలు బాక్సాఫీసు దగ్గర పోటీ పడుతున్నాయి. అయితే ఈ వారం సినిమాల లక్కు ఎలా ఉంది అంటే..  లాంగ్ వీకెండ్ రావడంతో.. సినిమాకి హిట్ టాక్ పడిందా? కలెక్షన్స్ కుమ్మరింతే. బాక్సాఫీసు కళకళలాడుతుంది. గత వారం వచ్చిన సినిమాలతో నీరసించిపోయిన ప్రేక్షకులకు ఈ వారం క్రేజ్ ఉన్న సినిమాల రాకతో కాస్తంత ఆసక్తితో ఉన్నారు. ఈ వారం నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. అందులో నితిన్ రంగ్ దే , రానా అరణ్య, ఈ కథలో పాత్రలు కల్పితం, అలాగే నెక్స్ట్ డే తెల్లవారితే గురువారం సినిమాలు బరిలోకి దిగుతున్నాయి.

Advertisement
CJ Advs

అయితే లాంగ్ వీకండ్ లో ఏ సినిమా క్యాష్ చేసుకోబోతుందో అని ఇప్పుడు అందరిలో ఒకటే క్యూరియాసిటీ. ఈ వీకెండ్ కి హోలీ హాలిడే అంటే మండే హాలీ డే కూడా కలిసిరాబోతుంది. మరి అందరి కన్నా ఎక్కువగా నితిన్ రంగ్ దే పై అందరి చూపు ఉంది. కామెడీ ఎంటర్టైనర్ గా రంగు రంగుల కలయికలో రంగ్ దే కనిపిస్తుంది. నితిన్ - కీర్తి సురేష్ కాంబోలో వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాపై మార్కెట్ లో మంచి బజ్ ఉంది. ఇక రానా అరణ్య తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కావాల్సి ఉండగా.. హిందీలో అరణ్య వాయిదా పడింది. ఇక తెలుగు తమిళంలో రేపు రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై కూడా మంచి బజ్ ఉంది. మరొకటి పవన్ కొణిదెల నటించిన ఈ కథలో పాత్రలు కల్పితం సినిమా కూడా రేపు శుక్రవారమే విడుదలకాబోతుంది. మరి కంటెంట్ కరెక్ట్ గా ఉంటే.. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే.. కలెక్షన్స్ వాటంతట అవే వచ్చేస్తాయి.

ఇక శనివారం సింహ కోడూరి తెల్లవారితే గురువారం రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాపై కూడా మంచి ఆసక్తి ఉంది ప్రేక్షకుల్లో. మత్తువదలరా సినిమాతో హిట్ కొట్టిన సింహ కోడూరి తెల్లవారితే గురువారం సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ గెస్ట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి అందరి చూపు పడేలా చేసుకున్నాడు. మరి ఈ నాలుగు సినిమాలలో ఈ లాంగ్ వీకెండ్ ని క్యాష్ చేసుకోబోయే సినిమా ఏదో మరికొద్ది గంటల్లో తేలిపోతుంది.

Movies that are releasing tomorrow :

Rang de, Aranya, Ee kathalo patralu kalpitam, Thellavarithe guruvaram releasing tomorrow
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs