థియేటర్స్ ఓపెన్ అయిన దగ్గరనుండి ప్రతి నెలా ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవుతూ వస్తుంది. జనవరిలో చాలా సినిమాలు రిలీజ్ అయినా రవితేజ క్రాక్ సూపర్ హిట్ అయ్యింది. అదే ఫిబ్రవరిలో లెక్కకు మించి సినిమాలు థియేటర్స్ లోకి వచ్చినా ఆ నెలలో కేవలం ఉప్పెన మాత్రమే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత మార్చ్ 11 వరకు మళ్ళీ హిట్ సినిమానే లేదు. మార్చ్ 11 మహా శివరాత్రికి మూడు సినిమాలు రిలీజ్ అయితే అందులో జాతి రత్నాలు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో అదరగొట్టేసింది. సినిమాలు ఇలా రిలీజ్ లు మొదలు పెట్టిన జనవరి నుండి నెలకో సినిమానే హిట్ అవుతూ వచ్చింది.
మరి ఇదే నెలలో రేపు మార్చ్ 26 న విడుదల కాబోతున్న నితిన్ రంగ్ దే సినిమా హిట్ అయితే.. ఈ సెంటిమెంట్ ని బ్రేక్ చేసినట్టే. ఎందుకంటే ఇదే నెలలో జాతి రత్నాల హిట్ ఉంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో కీర్తి సురేష్ - నితిన్ జంటగా తెరకెక్కిన రంగ్ దే పై మార్కెట్ లో మంచి బజ్ ఉంది. అలాగే ప్రేక్షకుల్లో రంగ్ దే సినిమాపై ఇంట్రెస్ట్ ఉంది. నితిన్ ఈసారి పక్కా హిట్ కొట్టడం గ్యారెంటీ లా కనిపిస్తుంది సినిమా ట్రైలర్ చూస్తే. ప్రమోషన్స్ కూడా పీక్స్ లో ఉన్న నితిన్ రంగ్ దే సినిమాపై ట్రేడ్ లోను మంచి హోప్స్ ఉన్నాయి. ఇక చెక్ సినిమా తర్వాత లవ్ స్టోరీ రంగ్ దే తో పక్కా హిట్ అనే నమ్మకం అయితే అందరిలో ఉంది. రేపు రంగ్ దే తో పాటుగా రానా అరణ్య విడుదలవుతుండగా.. నెక్స్ట్ డే తెల్లవారితే గురువారం సినిమా విడుదలకాబోతుంది. మరి రేపు ఈపాటికి రంగ్ దే తో హిట్ కొట్టి నితిన్ ఈసెంటిమెంట్ ని బ్రేక్ చేస్తాడా.. లేదా.. జస్ట్ వెయిట్ అండ్ సి.