Advertisement
Google Ads BL

నయన్ ఎంగేజ్మెంట్ అయ్యిపోయిందా


నయనతార లవ్ స్టోరీస్ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. ప్రభుదేవాతో ప్రేమ గతం గతః అన్నట్టుగా గత కొన్నేళ్లుగా దర్శకుడు విగ్నేష్ శివన్ తో కలిసి ట్రావెల్ చేస్తున్న నయనతార - విగ్నేష్ శివన్ ల ప్రేమ విషయము, పెళ్లి విషయము మీడియాలో ఎప్పుడూ హాట్ టాపిక్కే. అదిగో నయన్ పెళ్లి, ఇదిగో నయన్ పెళ్లి అనడమే కానీ ఆ కపుల్ మాత్రం పెళ్లి విషయంలో ఎలాంటి తొందర పడడం లేదు. విగ్నేష్ శివన్ మాకు ఇలానే బావుంది.. కెరీర్ లో సెటిల్ అయ్యాకే పెళ్లి అంటుంటాడు. నయనతార మాత్రం విగ్నేష్ రిలేషన్ షిప్ పై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోయినా ఫొటోస్ తో క్లారిటీ ఇస్తుంది. నయనతారకు పెళ్లి అనే సెంటిమెంట్ ఉండబట్టే ఆమె పెళ్ళికి తొందర పడడం లేదంటున్నారు. ప్రభుదేవాతో పీటలవరకు వచ్చిన పెళ్లి ఆగిపోవడంతో నయనతారకి పెళ్లి అంటే ఓ విధమైన సెంటిమెంట్ పట్టుకుంది అందుకే ఇలా అంటుంటారు నెటిజెన్స్.

Advertisement
CJ Advs

ప్రియుడితో కలిసి వెకేషన్స్ అంటూ ఎంజాయ్ చేసే నయనతార తాజాగా ఎంగేజ్మెంట్ చేసుకుంది అనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. విగ్నేష్ శివన్ గుండెల మీద చెయ్యి వేసి హగ్ చేసుకున్న నయనతార మొహం , విగ్నేష్ శివన్ ఫేస్ కవర్ చేసి కేవలం చెయ్యి మాత్రమే కనబడేలా ఓ పిక్ ని పోస్ట్ చేసింది ఈ జంట. ఆ పిక్ లో నయనతార వేలికి ఉన్న ఉంగరం చూసిన వారు నయనతారకి ఎంగేజ్మెంట్ అయ్యిపోయింది అని ఫిక్స్ అవుతున్నారు. విఘ్నేష్, న‌య‌న‌తార దగ్గరగా ఉన్నారు. ఇక వీరి మొహాలు కనిపించనప్పటికీ.. అందులో న‌య‌న్ చేతికి రింగు ఉండడం చూసిన వారు వీరికి ఎంగేజ్మెంట్ అయ్యిందనే అనుకుంటున్నారు. ఆ పిక్ చూసిన ఫాన్స్ కంగ్రాట్స్ అంటూ మెస్సేజ్ చేస్తున్నారు.

Nayanthara - Vignesh Shivan getting engaged:

Nayanthara-Vignesh Engaged?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs