Advertisement
Google Ads BL

సాయి పల్లవిని మ్యాచ్ చేసిన చైతు


సాయి పల్లవి గొప్ప డాన్సర్, బెస్ట్ డాన్సర్ అందులో ఎలాంటి సందేహం లేదు. అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ సరసన సాయి పల్లవి కాలు కదిపితే చూడాలనేది ఆమె అభిమానుల కోరిక. అయినా ఫిదా, లవ్ స్టోరీ వంటి సినిమాల్లో సాయి పల్లవి డాన్స్ ని తనివి తీరా ఆరగించేస్తున్నారు. ఫిదా లో తన డాన్స్ తో మెస్మరైజ్ చేసిన సాయి పల్లవి.. తన డాన్స్ నే కొట్టేసేలా లవ్ స్టోరీ సారంగ దరియాలో స్టెప్స్ వేసింది. ఆ సాంగ్ ఎంత హిట్టో.. అందులోని సాయి పల్లవి స్టెప్స్ అంతే హిట్ అయ్యాయి. ఇక లవ్ స్టోరీ మొత్తం సాయి పల్లవి డామినేషన్, నాగ చైతన్య హైలెట్ అవడం లేదు. ఆ సినిమా క్రెడిట్ మొత్తం శేఖర్ కమ్ముల, సాయి పల్లవికే అంటూ ప్రచారం జరుగుతుంది.

Advertisement
CJ Advs

అయితే ఈ రోజు మహేష్ చేతుల మీదుగా విడుదలైన లవ్ స్టోరీ సాంగ్ ఏవో ఏవో కలలే నుండి చైతు, సాయి పల్లవిల ఫోటో ఫ్రేమ్స్ తో పాటుగా అక్కడక్కడా డాన్స్ స్టెప్స్ కూడా రివీల్ చేసారు. ఏవో ఏవో కలలే సాంగ్ పోస్టర్ లోనే సాయి పల్లవి, నాగ చైతన్య డాన్స్ లుక్ చూస్తే ఈ సాంగ్ లో అదిరిపోయే స్టెప్స్ ఉండబోతున్నాయని అనుకున్నారు. అదే నిజమైంది. ఈ సాంగ్ లో నాగ చైతన్య కూడా సాయి పల్లవి తో పోటీ పడుతూ స్టెప్స్ వేసాడు. చైతూ సినిమాల్లో డాన్స్ ఉన్నా.. అది అంతగా ఎప్పుడూ ఎలివేట్ అవ్వలేదు. కానీ ఈసారి సాయి పల్లవి పుణ్యమా అని చైతు అదిరిపోయే డాన్స్ స్టెప్స్ చూసే అవకాశం అక్కినేని అభిమానులకి వచ్చినట్టే.. ఈ సాంగ్ లోని రెండు మూడు స్టెప్స్ చూసిన వారే.. చైతు కూడా సాయి పల్లవి డాన్స్ ని మ్యాచ్ చేసాడు అంటున్నారు. శేఖర్ మాస్టర్ కంపోజ్ చేసిన ఏవో ఏవో కలలే సాంగ్ తో చైతూ మీద అంచనాలు పెరిగిపోయాయి.

Evo Evo Kalale song from Love Story:

Mahesh Babu to launch Love Story Evo Evo Kalale song
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs