Advertisement
Google Ads BL

ఆ విషయంలో డార్లింగ్ ని కొట్టేవారే లేరు


ప్రభాస్ తో నటించే ఛాన్స్ రావాలనేది ఇప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ హీరోయిన్స్ వరకు ఒక కలలా మారిపోయింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో అవకాశం రావాలంటే అదృష్టం చేసుకోవాలి. బాహుబలితో ప్రభాస్ రేంజ్, క్రేజ్ అన్ని ఎవరికీ అందనంత ఎత్తుకు పెరిగిపోయాయి. ప్రస్తుతం రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీని చుట్టేసిన ప్రభాస్ అటు సలార్ సినిమా షూటింగ్ ఇటు ఆదిపురుష్ షూటింగ్స్ పారలల్ గా చేస్తున్నాడు. రాధేశ్యామ్ లో పూజ హెగ్డే తో రొమాన్స్ చేసిన ప్రభాస్ సలార్ లో సౌత్ హీరోయిన్ శృతి హాసన్ తో జోడి కట్టాడు. ఇక నాగ్ అశ్విన్ మూవీలో బాలీవుడ్ బడా హీరోయిన్ దీపికా పదుకొనే తో నటిస్తున్న ప్రభాస్ ఆదిపురుష్ లో కృతి సనన్ తో రొమాన్స్ చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

అయితే ప్రభాస్ తో కలసి నటించే హీరోయిన్స్ అందరూ చాలా ఎగ్జైట్ అవుతుంటారు. గతంలో ప్రభాస్ విందు గురించి గొప్పగా చెప్పిన సాహో భామ శ్రద్ద కపూర్.. ప్రభాస్ చాలా మొహమాటస్తుడని, కానీ మాట కలిపితే చాలా బాగా మాట్లాడతాడని చెప్పింది. సలార్ హీరోయిన్ శృతి హాసన్ కూడా అదే చెప్పింది. ఇక ఆ లిస్ట్ లో ఇప్పుడు కృతి సనన్ చేరింది. ఆదిపురుష్ సెట్స్ లోకి ఎంటర్ అయిన సీత పాత్రధారి కృతి సనన్.. ప్రభాస్ చాలా మొహమాటస్తుడు అని, సిగ్గుపడుతూనే విరామం లేకుండా మాట్లాడతారంటుంది. ఇక డార్లింగ్ ప్రభాస్ ఇంటి నుండి సెట్ లోని వారందరికీ కేరియర్స్ వస్తుంటాయని, అద్భుతమైన వంటకాలు అందరికి రుచి చూపిస్తారని, ప్రభాస్ తినడమే కాదు.. తన తోటివారికి కూడా ఫుడ్ సప్లై చెయ్యడం చాలా బావుంది అంటుంది కృతి సనన్. మరి ఆయనతో కలిసి వర్క్ చేసే హీరోయిన్స్ ఈ ఫుడ్ విషయంలో ఎప్పుడూ ఎగ్జైట్ అవుతూనే ఉంటారు. అందులో ఇప్పుడు కృతి సనన్ కూడా చేరింది.

Why Prabhas heroines are exiting ..:

Kriti Sanon praises her Adipurush co-star Prabhas
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs