Advertisement
Google Ads BL

ప్రభాస్ ఆదిపురుష్ ఫస్ట్ లుక్ ఎప్పుడంటే..


ప్రభాస్ - బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఆదిపురుష్ షూటింగ్ ముంబై లో మొదలైపోయింది. ఆదిపురుష్ సెట్స్ లో ఎంతో ఆహ్లాదంగా, ప్రశాంతంగా ఉంటుంది అంటూ ఓం రౌత్ ఈ మధ్యన ఓ ఇంటర్వ్యూలో  చెప్పాడు. అయితే ఆదిపురుష్ సినిమా రామాయణం నేపధ్యలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో.. సినిమాలో ప్రభాస్ రాముడిగా ఎలా ఉంటాడో అనే క్యూరియాసిటిలో ప్రభాస్ ఫాన్స్ మాత్రమే కాదు.. రాముడిని దేవుడిగా కొలిచే ప్రతి ఒక్క భక్తుడు వెయిట్ చేస్తున్నారు. అయితే రీసెంట్ గా షూటింగ్ మొదలు పెట్టిన ఓం రౌత్ ఆదిపురుష్ లో ప్రభాస్ లుక్ ఎప్పుడు విడుదల చేస్తాడో అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Advertisement
CJ Advs

ప్రభాస్ రాధేశ్యామ్ అప్ డేట్స్ కోసం ఫాన్స్ మొహం వాచిపోయి.. నిర్మాతలను సోషల్ మీడియాలో ఆడుకున్నాక కానీ వారు రాధేశ్యామ్ అప్ డేట్ ఇచ్చేవారు కాదు. కానీ ఈసారి ఆదిపురుష్ విషయంలో అలా జరగదని.. ఓం రౌత్ ఆదిపురుష్ లుక్ త్వరలోనే రివీల్ చేయబోతున్నాడట. ఏప్రిల్ లో శ్రీరామ నవమి పండుగ సందర్భంగా ప్రభాస్ రాముడు లుక్ వదలబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ప్రభాస్ బాహుబలిలో మహేంద్ర బాహుబలి, అమరేంద్ర బాహుబలిగా అదరగొట్టేసాడు. ఇప్పుడు రాముడిగా ప్రభాస్ ఎలా ఉంటాడు? అనే క్యూరియాసిటిలో ప్రేక్షకులు ఉండడంతో ఓం రౌత్ కూడా వాళ్ళని ఎక్కువ వెయిట్ చేయించకూడదనే ఆలోచనలో ప్రభాస్ లుక్ ని త్వరగా ఇవ్వాలనుకుంటున్నాడట.

Prabhas Adipurush First Look on..?:

Prabhas Adipurush First Look Poster Release Date Locked?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs