Advertisement
Google Ads BL

ఈ లెవల్లో వెల్ కమ్ అంటే..


ఎప్పుడో కొన్నేళ్ల క్రితం మోడల్ గా చేస్తున్న రోజుల్లో తమిళం లో ఎంట్రీ ఇచ్చిన పూజ హెగ్డే తర్వాత బాలీవుడ్, టాలీవుడ్ అంటూ తిరిగింది కానీ.. మళ్ళీ ఎప్పుడూ తమిళ్ వైపు కన్నెత్తి చూడలేదు. టాలీవుడ్ లో టాప్ పొజిషన్ ని ఎంజాయ్ చేస్తున్న పూజ హెగ్డే అటు బాలీవుడ్ లోను సత్తా చాటుతుంది. ప్రభాస్ తో కలిసి రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీ షూటింగ్ ముగించేసిన పూజ హెగ్డే అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మూవీ షూటింగ్ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేసేసింది. అలాగే రామ్ చరణ్ తో ఆచార్య లో గెస్ట్ రోల్ లో నటించిన పూజ హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ మూవీస్ తో బిజీగా ఉంటుంది. అయితే ఎప్పుడో వదిలేసిన తమిళ్ లో పూజ మరోసారి స్టార్ హీరోప్ సినిమా తో రీ ఎంట్రీ ఇవ్వబోతుంది.

Advertisement
CJ Advs

నెల్సన్ దర్శకత్వంలో విజయ్ హీరోగా త‌ల‌ప‌తి 65 లో పూజ హెగ్డే హీరోయిన్ గా ఫిక్స్ అయ్యింది. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను జ‌రుపుకుంటున్న ఈ చిత్రం త్వ‌ర‌లో సెట్స్ మీద‌కు వెళ్ల‌నుంది. అయితే ఈ సినిమాలో విజయ్ కి జోడిగా పూజ హెగ్డే నటించబోతుంది అనేది చిత్ర బృందం ఓ వీడియో తో రివీల్ చేసింది. అందులో పూజ హెగ్డే కి ఇచ్చిన ఎలివేషన్ అంతా ఇంతా కాదు. మరి టాప్ రేంజ్ లో ఉన్న బుట్ట బొమ్మ పూజ హెగ్డే కి ఆ రేంజ్ వెల్ కం ఉండాల్సిందే. ఇదంతా చూస్తుంటే టాలీవుడ్, బాలీవుడ్ లో టాప్ రేంజ్ లో ఉన్న పూజ హెగ్డే త్వరలోనే తమిళ్ స్టార్ హీరోలను చుట్టెయ్యడం ఖాయంగా కనబడుతుంది.         

Welcome on board: Pooja Hegde to star alongside Vijay:

Thalapathy 65: Pooja Hegde cast as Vijay co-star
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs