Advertisement
Google Ads BL

ఆ సీక్రెట్ రివీల్ చెయ్యని జాతిరత్నం


నవీన్ పోలిశెట్టి - అనుదీప్ కాంబోలో తెరకెక్కిన జాతి రత్నాలు మహా శివావరాత్రి రోజున రిలీజ్ అయ్యి కలెక్షన్స్ వర్షం కురిపించింది. ఆ సినిమా ప్రమోషన్స్, సినిమాకొచ్చిన పాజిటివ్ టాక్ అన్ని జాతిరత్నాలు సినిమాని సూపర్ హిట్ చేసేశాయి. నిర్మాతలు కలెక్షన్స్ వర్షంలో తడిచిపోయారు. అంత పెద్ద హిట్ అయినా కూడా జాతి రత్నాలు హీరో, మూవీ టీం ఇంకా ఇంకా సినిమా ప్రమోషన్స్ చేస్తూనే ఉంది. ప్రస్తుతం అమెరికాలో జాతిరత్నాలు ప్రమోషన్స్ లో ఉన్న టీం.. తెలుగులో ఎన్ని రకాలుగా సినిమా ప్రమోషన్స్ చెయ్యొచ్చో అన్ని రకాలుగా సినిమాని ప్రమోట్ చేసింది. అయితే జాతిరత్నాల డైరెక్టర్ అనుదీప్ ఎక్కడ కనిపించినా చెప్పులు లేకుండా, షూ లేకుండానే కనిపించేవాడు. అందరూ అదేమన్నా సెంటిమెంట్ ఏమో అనుకుంటున్నారు.

Advertisement
CJ Advs

అదే విషయాన్నీ అలీ తో జాలిగా కార్యక్రమంలో అలీ గారు అనుదీప్ ని అడిగారు. నువ్వెందుకు చెప్పులు కానీ షూ కానీ వేసుకోవు అని. దానికి అనుదీప్ అదేం సెంటిమెంట్ కాదండి.. నేను కొన్ని సార్లు చెప్పులు వేసుకోను, నవీన్ కొన్నిసార్లు వేసుకోడు.. ఎర్త్ నుండి ఎనర్జీ కోసమే చెప్పులు వేసుకోలేదంటూ చెప్పాడే కానీ.. అసలు సీక్రెట్ మాత్రం రివీల్ చెయ్యలేదు. నవీన్ పోలిశెట్టి కామెడీగా సెట్ లో చెప్పులు వేసుకోకుండా ఉంటే.. నటులంతా కాళ్ళు మొక్కడానికే అనుదీప్ చెప్పులేసుకోడు అంటూ కామెడీ చేసాడు. అయినా కానీ అనుదీప్ మాత్రం తానెందుకు చెప్పులు వేసుకోడో అసలు కారణం మాత్రం చెప్పలేదు.

That secret is the unspoken by Jathi Ratnalu Director:

Jathi Ratnalu Naveen and Anudeep Alitho Saradaga Show
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs