Advertisement
Google Ads BL

రాజ్ త‌రుణ్ స్టాండ‌ప్ రాహుల్ లుక్


రాజ్ తరుణ్ - విక్రమ్ కుమార్ కొండా కాంబోలో ఒరేయ్ బుజ్జిగా తో హిట్ కొట్టిన ఈ జంట.. రీసెంట్ గా అదే కాంబోలో తెరకెక్కిన పవర్ ప్లే ప్లాప్ అవడంతో.. రాజ్ తరుణ్ నెక్స్ట్ మూవీ ఎలాంటి మూవీ, ఎవరితో చెయ్యబోతున్నాడో అనుకుంటున్న సమయంలో ఓ కొత్త దర్శకుడితో మూవీ అనౌన్స్ చెయ్యడమే కాదు.. ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేసాడు రాజ్ తరుణ్.‌‌

Advertisement
CJ Advs

డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ మరియు హైఫైవ్ పిక్చర్స్ ప‌తాకాల‌పై నంద్‌కుమార్ అబ్బినేని, భరత్ మగులూరి సంయుక్తంగా సాంటో మోహన్ వీరంకిని  ద‌ర్శ‌కుడిగా పరిచ‌యం చేస్తూ  నిర్మిస్తున్న  ఫీల్ గుడ్ రొమాన్స్ కామెడీ చిత్రం స్టాండ‌ప్ రాహుల్‌. కూర్చుంది చాలు అనేది ట్యాగ్ లైన్‌.  

ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఈ రోజు విడుద‌ల‌చేసింది చిత్ర యూనిట్‌.  ఏదో తీవ్రంగా ఆలోచిస్తున్న‌ట్లు ‌ డెస్క్ మీద కూర్చున్న రాజ్‌త‌రుణ్ లుక్ అంద‌రి దృష్టిని ఆకర్షిస్తుంది.  స్టైలిష్ మేకోవ‌ర్‌, స్టైలిష్ హెయిర్‌డోతో క్లీన్ షేవ్‌ లుక్‌లో ఫ‌స్ట్‌లుక్‌లో యూబ‌ర్‌-కూల్‌గా కనిపిస్తున్నాడు రాజ్ త‌రుణ్‌.  టైటిల్ ఆసక్తికరంగా ఉండ‌డంతో పాటు ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటోంది.

ఇది జీవితంలో దేనికోసం క‌చ్చితంగా నిలబడని ఒక వ్య‌క్తి  నిజమైన ప్రేమను కనుగొని, తన తల్లి దండ్రుల కోసం మ‌రియు అతని ప్రేమ కోసం స్టాండ్-అప్ కామెడీ పట్ల ఉన్నత‌న‌ అభిరుచిని చాటుకునే  స్టాండ్-అప్ కామిక్ కథ.

ఈ చిత్రంలో వర్షా బొల్లమ్మ ప్రధాన పాత్ర‌లో న‌టిస్తుండ‌గా  స్వీకర్ అగస్తి సంగీతం,  శ్రీరాజ్ రవీంద్రన్ సినిమాటోగ్ర‌ఫి నిర్వ‌హిస్తున్నారు.

న‌టీన‌టులుః

రాజ్ త‌రుణ్‌, వ‌ర్ష‌బొల్ల‌మ్మ‌, వెన్నెల‌కిషోర్‌, ముర‌ళిశ‌ర్మ‌, ఇంద్ర‌జ‌, దేవీ ప్ర‌సాద్ మ‌రియు మ‌ధురిమ వెన్నెల‌కిషోర్‌, ముర‌ళిశ‌ర్మ‌, ఇంద్ర‌జ‌, దేవీ ప్ర‌సాద్ మ‌రియు మ‌ధురిమ ఇతర ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 

Raj Tarun Stand Up Rahul First Look:

Stand Up Rahul 1st Look
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs