Advertisement
Google Ads BL

వకీల్ సాబ్ నుండి బిగ్గెస్ట్ అప్ డేట్


వకీల్ సాబ్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ థమన్, డైరెక్టర్ వేణు శ్రీరామ్ లు వకీల్ సాబ్ మ్యూజిక్ ఫెస్ట్ అంటూ ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నారు. రీసెంట్ గా పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ డబ్బింగ్ కూడా పూర్తి చేసేసారు. దానితో ఏప్రిల్ 9 న విడుదల కాబోతున్న వకీల్ సాబ్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తిగా కంప్లీట్ అయ్యి ప్రమోషన్స్ జోరు పెంచింది టీం. పవన్ కళ్యాణ్ ప్రమోషన్స్ కి రాకపోయినా.. వకీల్ సాబ్ టీం మాత్రం సినిమాని భీభత్సంగా ప్రమోట్ చేస్తుంది. దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది అనే నమ్మకంతో టీం ఉంది. అయితే వకీల్ సాబ్ కి సంబందించిన బిగ్గెస్ట్ అప్ డేట్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఇవ్వబోతున్నట్టుగా శ్రీ వెంకటేశ్వర సోషల్ మీడియా అకౌంట్ నుండి ట్వీట్ పడింది. 

Advertisement
CJ Advs

The biggest update is on the way! 💫 #VakeelSaab

Stay tuned at 5 PM Today 💥

మరి ఈ రోజు వకీల్ సాబ్ కి సంబందించిన అప్ డేట్ ఏం ఇవ్వబోతున్నారబ్బా అంటూ పవన్ ఫాన్స్ ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మూడు పాటలు సెన్సేషన్ క్రియేట్ చేసాయి. మగువా.. మగువా, సత్యమేవ జయతే, కంటిపాప సాంగ్స్ యూత్ ని బాగా ఆకట్టుకున్నాయి. మరి ఇప్పుడు వకీల్ సాబ్ అప్ డేట్ అంటే ట్రైలర్ రిలీజ్ ఏమైనా ఉంటుందా? లేదంటే ప్రీ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయబోతున్నారా? అదీకాదంటే వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రాబోయే గెస్ట్ నేమ్స్ అనౌన్స్ చేస్తారా? అనే క్యూరియాసిటిలో ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.

Vakeel Saab Biggest Update :

Vakeel Saab biggest update is on the way
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs