Advertisement
Google Ads BL

వైరల్: దేవరకొండ తో సారా అలీఖాన్


విజయ్ దేవరకొండ పాన్ ఇండియా ఫిలిం లైగర్ షూటింగ్ ని పూరి ముంబై లో అధిక భాగం చిత్రిస్తున్నారు. అందుకే ఎక్కువగా ముంబై లో విజయ్ అండ్ పూరి లు ఉంటున్నారు. దాని కోసం పూరి మరియు ఛార్మీలు ముంబై లో ఓ కొత్త ఆఫీసర్ కూడా ఓపెన్ చేసారు. అయితే లైగర్ సినిమాకి కరణ్ జోహార్ కూడా వన్ అఫ్ ద ప్రొడ్యూసర్ కావడంతో తరుచూ కరణ్ జోహార్ లైగర్ టీమ్ ని కలవడమే కాదు.. విజయ్ దేవరకొండకి పూరి అండ్ ఛార్మి కి పార్టీలు ఇస్తున్నాడు. కరణ్ జోహార్ అంటేనే పార్టీలకు కేరాఫ్ అడ్రెస్స్ లాంటివారు. బాలీవుడ్ బడా సెలబ్రిటీస్ లో ఎవరి బర్త్ డే పార్టీ అయినా కరణ్ ఇంట జరగాల్సిందే.

Advertisement
CJ Advs

అయితే బాలీవుడ్ లో ఈ పార్టీలు చాలా కామన్. అందుకే విజయ్ బాలీవుడ్ లో అడుగుపెట్టినప్పటినుండి అక్కడి సెలబ్రిటీస్ తో ఎక్కువగా పార్టీలకు అటెండ్ అవుతున్నాడు. మొన్నామధ్యన సారా ఆలా ఖాన్ - విజయ్ దేవరకొండ ఓ పార్టీలో తీసుకున్న సెల్ఫీ లు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసాయి. ఆ తర్వాత కియారా అద్వానీ, అనన్య పాండే, సారా అలీ ఖాన్, మనీష్ మల్హోత్రా లతో విజయ్ దేవరకొండ - పూరి - ఛార్మీలు కరణ్ జోహార్ హౌస్ పార్టీకి వెళ్లారు. ఇక రీసెంట్ గా విజయ్ దేవరకొండ మరోసారి సారా అలీఖాన్ తో పార్టీ చేసుకున్నాడు. అంటే విజయ్ ఒక్కడే కాదు.. పూరి, ఛార్మి, కరణ్ జోహార్, మనీష్ మల్హోత్రా లతో జరిగిన పార్టీ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

అయితే సారా అలీ ఖాన్ తరుచూ కరణ్ అండ్ విజయ్ పార్టీలో కనిపించడంతో సారా ఏమైనా లైగర్ లో నటిస్తుందేమో అనే అనుమానాలు మొదలయ్యాయి. ఇప్పటికే అనన్య పాండే లైగర్ లో హీరోయిన్ గా నటిస్తుంది.. అయితే లైగర్ లో గెస్ట్ రోల్ ఏమైనా సారా చేస్తుందా? లేదంటే విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీలో సారా హీరోయిన్ అయ్యుంటుందా? అనే డౌట్ లో టాలీవుడ్ జనాలు ఉన్నారు.

Liger Team Party Pics: Viral:

Vijay Deverakonda Party Mood With B-town Stars
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs