గత ఏడాది కరోనా లాక్ డౌన్ మళ్ళీ పునరావృత్తం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా రోజు రోజుకి పెరిగిపోతుండడడంతో ఇప్పుడు మళ్ళీ లాక్ డౌన్ పెట్టె సూచనలు అన్ని చోట్లా అనివార్యం అయ్యేలా ఉంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో లాక్ డౌన్ లు నైట్ కర్ఫ్యూలు అమలవుతున్నాయి. అయితే తెలంగాణాలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా లాక్ డౌన్ పెట్టొచ్చు అనే ఊహాగానాలకు తెలంగాణ మంత్రి ఈటెల రాజేంద్ర తెర దించారు. వీకండ్ లాక్ డౌన్, నైట్ కర్ఫ్యూ పెట్టే ఆలోచన లేనట్లుగా టీఆరెస్ మంత్రులు అంటున్నప్పటికీ.. కరోనా తీవ్రత ఎక్కువవడం సెకండ్ వెవ్ కూడా మొదలవుతుంది అనే భయాందోళనల మధ్యన లాక్ డౌన్ పెట్టడమే ఉత్తమం అనే ఆలోచనలో ప్రభుత్వం ఉందనిపిస్తుంది.
అయితే లాక్ డౌన్ కన్నా ముందు స్కూల్స్. కాలేజెస్, హాస్టల్స్ లో కరోనా తీవ్రత ఎక్కువడంతో తెలంగాణ ప్రభుత్వం ఆ మేరకు కొన్ని చర్యలు మొదలు పెట్టింది. ఏపీలో ఇప్పటికే ఒకటో తరగతి నుండి పదో తరగతి వరకు ఒంటి పూట బడులకు రంగం సిద్ధం చెయ్యగా.. ఇప్పుడు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సీఎం కేసీఆర్ తో చర్చించి తెలంగాణ విద్యా సంస్థల మూసి వేతపై ఓ నిర్ణయానికి వచ్చారు.
ఆన్ లైన్ క్లాస్ లు యధావిధిగా కొనసాగుతాయని, మెడికల్ కాలేజెస్ కి మినహాయింపులు ఇచ్చిన ప్రభుత్వం.. విద్యా సంస్థల మూసివేత తాత్కాలికమే అని కరోనా కంట్రోల్ అయితే మళ్ళీ స్కూల్స్ రీ ఓపెన్ చేస్తామని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రకటించారు. రేపటినుండి తెలంగాణాలో విద్యా సంస్థలు మూసి వేతకు రంగం సిద్దమయ్యింది.