Advertisement
Google Ads BL

తలైవి ట్రైలర్: మహా భారతానికి ఇంకో పేరు


దివంగత సినీ నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం తలైవి. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయలలిత పాత్ర పోషిస్తుండగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేస్తున్నారు. తలైవి సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. తాజాగా విడుదలైన తలైవి ట్రైలర్ లో.. కంగనా అమ్మ జయలలితగా అద్భుతమైన నటన కనబర్చింది.

Advertisement
CJ Advs

ఒక సినిమా నటితో మనకు రాజకీయ నేర్పించాలనుకోవడం.. ఇది మగవారి ప్రపంచం..మగవాళ్లే పాలించాలి.. ఓ ఆడదాని చేతిలో పార్టిని పెట్టి వెనక నిల్చున్నాం, జయనే వారు వారసురాలిగా చూస్తున్నారు.. ఈ ప్రజలకు ఏదైనా చేయాలి.. ఈ ప్రజల్లోకి రా.., నటించి ఇంత మందిని సంతోషపెడుతున్నాను..ప్రజల్లో లేను అంటారా?, రాజకీయాల్లోకి రా అని అంటున్నా. నిన్ను గెలవాలని అనుకోవడానికి నువ్ అంత పెద్ద మనిషివేం కాదు.. నిన్న కురిసిన వానకు.. ఇవాళ మొలిచిన గడ్డిమొక్కవి నువ్.. మర్రిచెట్టును ఢీ కొట్టాలని చూడకు.. ఎవరు మొక్కో ఎవరు చెట్టో కాలమే సమాధానం చెబుతుంది.., మహాభారతంలో ద్రౌపదికి ఇదే జరిగింది.. తన చీరను లాగి అవమాన పరిచిన కౌరవుల కథ ముగించి జడ ముడిచి శపదాన్ని నెరవేర్చుకుంది.. ఆ మహా భారతానికి ఇంకో పేరు ఉంది అదే జయ..నీ విజయమే తమిళనాడు విజయం.., ఇది పోరాటం.. ప్రజల కోసం పోరాటం.. ప్రాణం పోయే వరకు పోరాడుదాం, ప్రజలను నువ్ ప్రేమిస్తే.. వారు నిన్ను ప్రేమిస్తారు అదే రాజకీయం, నన్ను అమ్మగా చూస్తే హృదయంలో చోటు ఉంటుంది.. నన్ను కేవలం ఓ ఆడదానిలా చూస్తే..  అనే డైలాగ్స్ టీజర్‌లో అదిరిపోయాయి. ఇక ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో దర్శక నిర్మాతలు, కంగనా రనౌత్, అరవింద్ స్వామి మాట్లాడారు.

కంగనా రనౌత్ మాట్లాడుతూ.. నేడు నా పుట్టిన రోజు. జన్మనిచ్చినందుకు నా తల్లిదండ్రులకు థ్యాంక్స్. నా జీవితంలో ఉన్న ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. విజయేంద్ర ప్రసాద్ గారు నన్ను రికమండ్ చేయకపోయి ఉంటే.. ఈ చాన్స్ వచ్చేది కాదు. నా జీవితంలో మొదటి సారి ఇలా ఒకరు రికమెండ్ చేశారు. నేను ఈ పాత్రకు సరిపోతాను అని మీరు ఎలా అనుకున్నారు అని దర్శకుడు విజయ్‌ని అడిగాను. క్యాస్టింగ్ సరిగ్గా లేకపోతే సినిమా ఆడదు అని ఆయనకు చెప్పాను. కానీ విజయ్ నన్ను ఒప్పించారు. ఈ సినిమా బృందగారి వల్లే మొదలైంది. మగవారు మహిళా సాధికారత గురించి మాట్లాడతారు. అయితే లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటించేందుకు సూపర్ స్టార్స్ ముందుకు రారు. కానీ అరవింద్ స్వామి లాంటి పెద్ద హీరోలు ముందుకు వచ్చినందుకు థ్యాంక్స్ . ఎంతో మంది మహిళలు మగవారికి అన్నింట్లో సపోర్టివ్‌గా ఉంటారు. సూపర్ స్టార్స్ ఇలా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించాలని, వారిని సపోర్ట్ చేసే రోజులు బాలీవుడ్‌లో కూడా వస్తాయని ఆశిస్తున్నాను. దక్షిణాదిలో నెపొటిజం, గ్రూపిజం, గ్యాంగిజం లాంటివి లేవు. నేను ఈ ఇండస్ట్రీని వదిలి వెళ్లను. ఇక్కడే ఉంటాను. ఇంకా చాలా సినిమాలు చేయాలని అనుకుంటున్నాను. నా దర్శకుడి గురించి చెప్పాలంటే మాటలు చాలడం లేదు. నేను ఎప్పుడు ఎక్కడున్నా కూడా నన్ను నవ్విస్తుంటారు. ఆయన లాంటి వ్యక్తిని నా జీవితంలో ఇంత వరకు చూడలేదు అని అన్నారు.

Thalaivi Trailer launch:

Kangana Thalaivi Trailer launch
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs