బాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లిస్ట్ లో చేరిన గ్లామర్ గర్ల్ కియారా అద్వానీ.. ఈ మధ్యన మ్యాగజైన్ ఫోటో షూట్స్ కోసం అద్భుతమైన ఫొటోలకి ఫోజులిచ్చింది. అందానికి, గ్లామర్ కి కొత్త నిర్వచనం చెబుతున్న ఈ చిన్నది గత కొన్నాళ్లుగా బాలీవుడ్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రా తో డేటింగ్ చేస్తుంది. వాళ్లిద్దరూ కలిసి పార్టీలకి, రెస్టారెంట్స్ కి వెకేషన్స్ కి వెళ్ళిన ఫొటోస్ సోషల్ మీడియాలోలో ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. చాలాసార్లు ఎయిర్ పోర్ట్ లో దొరికిపోయిన ఈ జంట ఇప్పటివరకు తమ మధ్యన ఉన్న లవ్ ఎఫ్ఫైర్ ని ఒప్పుకోలేదు.
రీసెంట్ గా కియారా అద్వానీ తన బాయ్ ఫ్రెండ్ విషయాన్నీ బయట పెట్టింది. తాను ఓ బాలీవుడ్ హీరోతో డేటింగ్ లో ఉన్నానని ఈమధ్యనే అతనితో వెకేషన్స్ కి వెళ్ళిన విషయాన్నీ బయట పెట్టిన కియారా అద్వానీ అతని పేరు మాత్రం బయట పెట్టలేదు. ఇక బాయ్ ఫ్రెండ్ తనని గనక మోసం చేస్తే.. ఇంకెప్పుడు తన జీవితంలో అతని మొహం చూడనని.. అదే అతనికి పెద్ద పనిష్మెంట్ అంటూ తన బాయ్ ఫ్రెండ్ విషయాలను రివీల్ చేసింది కియారా అద్వానీ.