బిగ్ బాస్ అంటే కాంట్రవర్సీలకి కేరాఫ్ అడ్రెస్స్. అది ఉంటేనే బిగ్ బాస్ కి రేటింగ్స్ వస్తుంటాయి. బిగ్ బాస్ లో కంటెస్టెంట్స్ గొడవలే బాగా హైలెట్ అయ్యి బిగ్ బాస్ కి క్రేజ్ వచ్చేది. ఆ గొడవలను వీకెండ్స్ లో హోస్ట్ గా చేస్తున్న స్టార్స్ సాల్వ్ చెయ్యడమే కాదు.. ఆ కంటెస్టెంట్స్ కి ఫుల్ క్లాస్ కూడా ఇస్తుంటారు. బిగ్ బాస్ హోస్ట్ గా చేస్తున్నందుకు భారీ పారితోషకాలే కాదు.. బోలెడన్ని బాధ్యతలు మొయ్యాలి. బాలీవుడ్ లో 14 సీజన్స్ ని సల్మాన్ ఖాన్ సక్సెస్ ఫుల్ గా నడిపాడు. ఇక మలయాళంలో మోహన్ లాల్, కన్నడ లో సుదీప్, తమిళ్ లో కమల్ హాసన్ బిగ్ బాస్ మొదలైనప్పటినుండి హోస్ట్ లుగానే కొనసాగుతున్నారు. ఇక తెలుగులో సీజన్ కి ఒకరు మారుతున్నారు.
మొదటి సీజన్ ని ఎన్టీఆర్ నడపడం, సెకండ్ సీజన్ ని నాని హోస్ట్ చేసాడు. ఇక మూడు నాలుగు సీజన్స్ కి నాగ్ హోస్ట్ గా చేసాడు. అయితే ఇప్పుడు తమిళనాట కూడా కమల్ హాసన్ బిగ్ బాస్ నుండి తప్పుకోబోతున్నారనే ప్రచారం జరుగుతుంది. కమల్ రాజకీయాలు, అటు సినిమాలతో బిజీగా ఉండడంతో బిగ్ బాస్ బాధ్యతను మొయ్యలేనని డిసైడ్ అయ్యి ఐదో సీజన్ నుండి తప్పుకోబోతున్నారట. గతంలోనే తనకు బిగ్ బాస్ షోపై పెద్దగా ఆసక్తి లేదని.. కేవలం తాను కొత్తగా పెట్టే పార్టీని నడపడానికి అవసరమైన డబ్బుల కోసమే ఈ షోను హోస్ట్ చేస్తున్న అంటూ చెప్పిన కమల్ ఈసారి ఆ బాధ్యతలను మొయ్యలేనని చెప్పెయ్యడంతో బిగ్ బాస్ తమిళ యాజమాన్యం మరో నటుడు శింబుని సంప్రదించేపనిలో ఉందట.