Advertisement
Google Ads BL

ఆగండి బ్రదర్ అంటున్న ఎన్టీఆర్


ఎన్టీఆర్ చాలా రోజులుగా పాలిటిక్స్ విషయంలో చాలా సైలెంట్ గా ఉంటున్నాడు. మొన్నటికి మొన్న ఎవరు మీలో కోటీశ్వరులు ప్రెస్ మీట్ లో మీడియా మిత్రుడు మీరు ఎప్పుడు రాజకీయాల్లోకి వస్తారు అని అడిగిన ప్రశ్నకి.. పాలిటిక్స్ గురించి మాట్లాడడానికి ఇప్పుడు సమయం కాదంటూ సున్నితంగా వారించిన ఎన్టీఆర్.. ఇప్పుడు మాత్రం అభిమానులను గట్టిగానే వారించాడు. ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా కీరవాణి తనయుడు సింహ నటించిన తెల్లవారితే గురువారం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని జెఆర్సీ లో గ్రాండ్ గా నిర్వహించారు. గెస్ట్ గా వచ్చిన ఎన్టీఆర్ స్టేజ్ ఎక్కి.. నేను ఎప్పుడూ ఇంతిలా ఇబ్బంది పడలేదు మాట్లాడడానికి. కానీ ఫస్ట్ టైం సింహ, భైరవ గురించి మాట్లాడానికి చాలా ఇబ్బంది పడుతున్నాను.

Advertisement
CJ Advs

నా కొడుకులు అభయ్, భార్గవ్ లు పెద్దయ్యాక ఏదైనా సాధించినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడడానికి ఎంతగా ఇబ్బంది పడతానో.. ఈ రోజు అంతగా ఇబ్బంది పడుతున్నా సింహ, భైరవ లు సాధించిన దాని గురించి మాట్లాడడానికి అంటూ మాట్లాడిన ఎన్టీఆర్.. రాజమౌళి ఫ్యామిలీ తనకి దేవుడిచ్చిన ఫ్యామిలీ అని, తాను ఆ ఫ్యామిలీకి ఎప్పటికి గెస్ట్ లా ఉండలేనని, అలాగే వాళ్ళు తనకి గెస్ట్ లు కాకూడదు అంటూ.. మాట్లాడుతున్న సమయంలో ఎన్టీఆర్ ఫాన్స్ సీఎం సీఎం అంటూ కేకలు వెయ్యడంతో.. ఎన్టీఆర్ కి కాస్త కోపం వచ్చింది. ఆగండి బ్రదర్.. ప్లీజ్ స్టాప్ అంటూ సీరియస్ అయ్యాడు. తనకి ప్రస్తుతం పాలిటిక్స్ గురించి మట్లాడడం ఇష్టం లేదని ఎన్టీఆర్ మరోమారు పబ్లిక్ స్టేజ్ మీద చెప్పకనే చెప్పాడు.

Jr NTR Serious On His Fans :

Jr.NTR Serious Warning To His Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs